ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య (Road safety education)

 

రవాణా రంగం (Transport sector)

Community-verified icon
చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది. ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత.

రోడ్డు రవాణా సాధనాలు (Means of road transport)


ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర. బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు 500 రూపాయలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేయవచ్చు.

ట్రాఫిక్ అంటే ఏంటి? (What is traffic?)

Community-verified icon

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళి వాటిని ట్రాఫిక్ అంటారు. అలాగే వాహనాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు రోడ్డుమీద వెళ్ళటానికి ఈ ట్రాఫిక్ ను ఉపయోగిస్తారు.




ట్రాఫిక్ విద్య అంటే ఏంటి ? (What is traffic education?)


ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయ దాన్ని ట్రాఫిక్ విద్య అంటారు. మీరు ఎప్పుడైనా రోడ్డు పై జరిగిన ప్రమాదాలు చూశారా? చూసినట్లయితే వారు ఏవిధంగా గాయపడ్డారు? ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో ఎప్పుడైనా ఆలోచించారా?

ట్రాఫిక్ విద్యా - అవసరం, ప్రాముఖ్యత: (Traffic Education - Need, Importance: )


యుక్త వయసులో పిల్లలు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడం వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో చిన్న పిల్లలు ఎక్కువ. తీవ్రమైన ప్రమాదాలను కొన్నిసార్లు మరణాలకు ముఖ్య కారణం రోడ్డు ప్రమాదాలు అని చాలా మందికి తెలియదు. అందుకే ప్రమాదాలు నివారణకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరం.

ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం) (Traffic problems (congestion) )


మీరు ఉదయం పాఠశాలకు వెళ్ళవలసి ఉంది. ఆలస్యంగా వెళితే తరగతులు కోల్పోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అట్లా అయితే మీరు ఏం చేస్తారు? విద్యార్థులు, ఉద్యోగులు, శ్రామికులు టీచర్లు డాక్టర్లు ఇంకా ఎందరో ఇలా ట్రాఫిక్ లో చిక్కుకుంటారు. కాలిబాట పాదచారులకు ప్రత్యేకంగా రోడ్డుకి ఇరువైపులా వేసి ఉంటుంది.

జీబ్రా క్రాసింగ్ (Zebra crossing)

Community-verified icon

ఆటోలు, బస్సులు ఆగినపడు రోడ్డుపై గీసిన తెల్లటి చారల పై నుండి మాత్రమే మనుషులు రోడ్డు కు ఒక దిక్కు నుండి మరొక వైపు వెళ్ళడం పోలీసు అందరికీ సహాయం చేయడం గమనించవచ్చు.ఈ తెల్లటి చారలని జీబ్రా క్రాసింగ్ అంటారు. వాటి మీద పాదచారులు రోడ్డు దాటుతూ ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ కారణంగా రోడ్డుపైన వాహనాలు నెమ్మదిగా వెళుతూ ఉంటాయి.

రోడ్డు పై వాహనాలు (Vehicles on the road )

Community-verified icon

వాహనాన్ని బండి అని కూడా అంటారు .వాహనం అనగా ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుని వెళ్లే బండి.వాహనం వేడుక వలన నడక తగ్గుతుంది. అంటే వాహనం లో ఎక్కడికైనా ఎంత దూరం ఐన నడవకుండా వెళ్ళవచ్చును. వాహనాన్ని ఆంగ్లము లో వెహికల్ అని అంటారు.ఈ రోజుల్లో వాహనం అనేది ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువు.వాహనం లేకుండా ఏ ఒక్కరూ బైటకి అడుగు పెట్టడం లేదు .నడక ను మాని వాహనం లోనే ఎంత దూరం ఐన ప్రయాణం చేస్తూ ప్రజలు సుఖపడుతున్నారు.

రోడ్డు ప్రమాదాలు (Road accidents )

Community-verified icon

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతూ వుంది . రోడ్డు వల్ల సంభవించే ప్రమాదాలను రోడ్డు ప్రమాదాలు అని అంటారు. ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి సాధారణంగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో మరియు రోడ్డు మీద నడిచే పాదచారులు లేదా జంతువుల ను వాహనాలుగా ఢీకొట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఈ రహదారి ప్రమాదాల వలన రోడ్డు మీద నడిచే మనుషులు జంతువులకు కొన్ని కొన్ని సార్లు గాయాలు అవడం కొన్ని సార్లు మరణాలు సంభవిస్తాయి. 

వాహనచోదకము (Driving)

ఒక వాహనం యొక్క చర్య మరియు కదలికలను నియంత్రించడం నీ నడపడం అంటారు. ఉదాహరణకు కారు, బస్, ట్రక్ వంటి వాటిని నడపడం వంటివి. 

రోడ్డు నియమాలు (Rules of the road)

Community-verified icon

పాదచారుల దారి రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడపటానికి వీలుగా ఉండీ ఇది సుమారు రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది. రోడ్డు కి ఇరువైపులా సిమెంట్ దిమ్మలతో పాదచారుల నడుచు స్థలం ఉంటుంది.

జీబ్రా క్రాసింగ్ పాదచారులు రోడ్డు ఒక వైపు నుంచి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించినది .ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీటిని సూచిస్తారు

రోడ్డు మీద ట్రాఫిక్ గుర్తులు (Traffic signs on the road)

Community-verified icon

వాహనాలను ప్రమాద రహితంగా నడవడానికి వీలుగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తులని సూచించే పరికరం ట్రాఫిక్ గుర్తులు అంటారు.

రోడ్డు ప్రమాదాలు నియమాలు (Road Accidents Rules )

రోడ్ల పై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు వుంటాయి. అనగా ఎర్ర లైటు వెలిగినప్పుడు ఆగడం, పచ్చ లైటు వెలిగినపుడు ముందుకు వెళ్లడం, ఆరెంజ్ లైట్ వెలిగిన అప్పుడు సిద్ధంగా ఉండడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టం అంటారు. పట్టణాల్లో నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతే నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టం ఉపయోగపడుతుంది. దీని వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్లేవారు తమ ఎడమవైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించిన నియమం. రోడ్డుపైన చారలు గీసి ఉన్నచోట మనుషులు రోడ్డు దాటడం చూసే ఉంటారు. దీనినే జీబ్రా క్రాసింగ్ అంటారు .ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళతాయి.

వీధుల్లో సంచరించే జంతువులు పండ్లు ,కూరగాయల, వ్యాపారులు, వాహనాలు, వాహనదారులు ముఖ్యంగా కారులో ఆటోరిక్షా వారు నిలుపుటకు వీలు లేదు. ఆ ప్రదేశంలో నిలుపుట వల్ల ట్రాఫిక్ జామ్ కారణమవుతున్నాయి. జనాభా పెరగడం వాహనాలు వినియోగం కూడా పెరగడం మూలంగా రోడ్డు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలను విధిగా తెలుసుకోవాలి.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం (Driving license required)


డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు. ఇది ఎవరికీ మినహాయింపు కాదు.

డ్రైవింగ్ లైసెన్స్ రకాలు:
  • లెర్నర్ లైసెన్స్: ఇది తాత్కాలికమైన డ్రైవింగ్. ఇది నేర్చుకొనుటకు ఆరునెలల కాలపరిమితితో దీనిని జారీ చేస్తారు. 
  • శాశ్వత లైసెన్స్: తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక ఆరు నెలల తర్వాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. 

విశ్వాస పరీక్ష పరికరం ఎలా పనిచేస్తుంది? (How does a confidence test instrument work?)

Community-verified icon

ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది రక్తంలో కలిసి పోయినా మన శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ఈ రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడం ద్వారా మనం విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్ సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించగలం. మనం విడిచి పెట్టే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పాటు ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా వుంటుంది. ఇది తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఈ పరికరం గుర్తించగలదు. ఒకవేళ ఈ పరికరం ద్వారా పరీక్షించి అవసరం సంబంధిత అధికారులకు నిందితులకు మేలు చేయాలని ప్రయత్నించిన ఆ పరికరంలో నమోదైన విషయాలను తొలగించే అవకాశం లేదు.

రహదారి భద్రత ( Road safety )

Community-verified icon

తాగి డ్రైవింగ్ చేసే వారికి శిక్షలు
  • తాగి వాహనం నడిపితే వారి వాహనాలను అధికారులు సీజ్ చేయవచ్చు. 
  • వాహన చోదకులు కోర్టులో హాజరై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

డ్రైవర్ సలహాలు (Driver Advice)

Community-verified icon

వాహన రిజిస్టర్ను డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన సమాచారం తెలుసుకోవడానికి ఆర్టీవో ఏ కార్యక్రమానికి కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అధికారులు సూచనల మేరకు అవసరమైన పత్రాలను సమర్పించి ఆ తర్వాత ఏ విధంగా రిజిస్టర్ చేయించుకోవాలి శాశ్వత రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి అనేదిి వివరిస్తారు. ప్రతిి ఒక్కరు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వాహనం నడప రాదూ.

రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి (How to register)

Community-verified icon

తాత్కాలిక రిజిస్ట్రేషన్
: కింది చూచినను ధ్రువీకరణ పత్రాలు రిజిస్ట్రేషన్కు అవసరం.
  • అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువ పత్రం. 
  • రోడ్డుపై నడవడానికి వీలైనది ధ్రువీకరణ పత్రం. 
  • వాహన బీమా ధ్రువపత్రం. 
  • కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం. 
  • నివాస  ధ్రువపత్రం. 

శాశ్వత రిజిస్ట్రేషన్: తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతోపాటు ఆర్టీఓ అధికారులు ఒక నెల లోపు గా సమర్పించి రిజిస్ట్రేషన్ పొందవచ్చు.


రోడ్డుపై సూచించే గుర్తులు (Road signs)

Community-verified icon

రోడ్డు ఉపరితలంపై పాదచారులు కోసం వాహన దారులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని ఆగమనాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తును ఉపయోగిస్తారు. 

రోడ్డు భద్రతా వారోత్సవాలు (Road Safety Week)

Community-verified icon

ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను రవాణా శాఖ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు గురించి ప్రచారం చేస్తుంది. డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ట్రాఫిక్ నియమాలు (Traffic rules )

Community-verified icon
 
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపరాదు. ద్విచక్రవాహనంపై వెళ్లే వారు తప్పక హెల్మెట్ ధరించాలి. అలాంటి వాహనాలు నడిపేవారు సీట్లలో కూర్చున్న వారు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి .ఇయర్ ఫోన్ లో పాటలు వింటూ వాహనం నడప రాదూ. 

పరిమితికి మించి సభ్యులు వాహనంలో సూచనలు ఇవ్వకుండా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయరాదు. .వెనుక వాహనాలకు సూచనలు ఇవ్వకుండా కుడి, ఎడమ లకు తిరగరాదు. రోడ్డు నియమాలు పాటించాలి. సిగ్నల్ ఆధారంగా ప్రయాణించాలి. 

నియమిత వేగంతో పోతే వాహనం మన అధీనం లో వుంటుంది. ప్రమాదాలు తప్పించవచ్చు. వాహనాలపై వెళ్ళేవారు ఐన , రోడ్డు పైన నదిచేవరైన రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలి.తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. 

బడికి వెళ్లే పిల్లలు చిన్న పిల్లలు రోడ్డు దాటుతూ వుండగా పెద్దవాళ్ళ చేతులు పట్టుకుని దాటాలి. రోడ్డు పైన వాహనాలు వస్తున్నపుడు ఎక్కడ పడితే అక్కడ దాటకుడదు. జీబ్రా క్రాసింగ్ గీతలు గీసిన చొటునే దాటాలి. అవసరం ఐతే పోలీస్ సహాయం అడగాలి.  ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్