ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విటమిన్లు వాటి ఉపయోగాలు



విటమిన్లు వాటి ఉపయోగాలు 

విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్ అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది.

విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి 'vitamines' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని 'vitamins' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల  నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. 


1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు.
  • కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె 

  • నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు

కొవ్వులో కరిగే విటమిన్లు


ఎ (A)  విటమిన్ (రెటినాల్) 

మనం తీసుకునే ఆహారంలో విటమిన్ లోపిస్తే అంధత్వానికి దారి తీస్తుంది. తక్కువ కాంతిలో ఆ రాత్రి చూపు మందగిస్తుంది, హస్వ మరియు దూరదృష్టి కలగడం ఈ విటమిన్ వల్లనే జరుగుతోంది. చూడటానికి కళ్ళు కాంతిహీనంగా కనబడటం పొడిగా గరుకు ఉండటం దీని లక్షణాలు

లోపం వల్ల కలిగే వ్యాధులు 


రేచీకటి, జిరాక్స్ దాల్మియా శుక్ల పటలం పగలటం, చర్మం గరుకుగా మారడం, పోలుసుగా   ఊడిపోవటం

లభించే పదార్ధాలు 

Vitamins in fruits, vegetables and meat
పళ్ళు కూరగాయలు మరియు మాంసం 
పాలు, గుడ్డు ,వెన్న, క్యారెట్, బొప్పాయి, బచ్చలికూర, తోటకూర, గుమ్మడి సార్క్ చేపల, కాలేయం నూనె, కార్డు లివర్ ఆయిల్ ,మునగ, కొన్ని పళ్ళు చెట్లు నుండి లభిస్తుంది. 

ఎ  విటమిన్ అధికంగా లభించే పదార్థం 


క్యారెట్, ఎ విటమిన్ అధికంగా గల ఆకు కూర బచ్చలి, పాలకూర, మునగాకు, బాగా పండిన మామిడి, టమోటో, వెన్న, నెయ్యి, పాలల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. బొప్పాయిల కూడా అధికంగా ఉంటుంది. 

కంటి చూపు తోడ్పదెందుకు ఈ విటమిన్ చాల బాగా పనిచేస్తుంది. పామ్ ఆయిల్ పసుపురంగులో, క్యారెట్ ఆరెంజ్ రంగులో ఉండటానికి ఎ విటమిన్ 

ఉపయోగాలు 


కంటి చూపునకు, గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు, చర్మం కాంతివంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.


విటమిన్ డి (D) (కాల్సిఫెరాల్)


చిన్నపల్లల్లో ఈ విటమిన్ లోపం వలన రికెట్స్ అనే వ్యాధి కలుగుతుంది

లోపం వల్ల కలిగే వ్యాధులు


రికెట్స్ (చిన్నపిల్లల్లో), ఎముకలు పెళుసుగా అవ్వటం, మణికట్టు దగ్గర వాపు, దొడ్డి కాళ్ళు, పెద్దవారిలో ఎముకల బలం కోల్పోవడం అనేది డి విటమిన్ లోపం వాళ్ళ కలుగుతుంది. 

లభించే ఆహార పదార్ధాలు

Different types of fruits, which help in vitamins
పళ్ళు కాయలు 

డి విటమిన్ కూరగాయల్లో లభించదు. సూర్యకాంతి వల్ల లభిస్తుంది. గుడ్డు, కార్డు లివర్ ఆయిల్,
షార్క్ చేప నూనె, పాలు మొదలగునవి. 

విటమిన్ ఇ (E) (టోకోఫెరాల్)


ఇ  విటమిన్ కి ఇంకో పేరు బ్యూటీ విటమిన్, వంధ్యత్వ నిరోధక విటమిన్. మనం తీసుకొనే ఆహారం లో ముఖ్యంగా ఈ విటమిన్ కారణంగా పురుషుల్లో బీజ కణాల అభివృద్ధి సరిగా లేకపోవటం, ఆడవారిలో గర్భస్రావం సరిగా జరగకుండా అవుతుంది.

లోపం వల్ల కలిగే వ్యాధులు


పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, ఎర్ర రక్త కణాల జీవిత కాలం తగ్గటం, కండరాల క్షీణత వంటి వ్యాధులు కలుగును. 

లభించే ఆహార  పదార్థాలు


పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతం, మొక్క గింజలు, పత్తి గింజలు, గింజల నుండి తీసిన నూనె, మాంసంలో ఈ విటమిన్ ఎక్కువగా లభ్యమవుతుంది. కాయగూరలు మొలకెత్తిన గింజలు, మాంసం, పొద్దుతిరుగుడు గింజలు, నూనె పత్తిగింజల, నూనె తాజాఫలాలు. కొన్ని ఆహార పదార్దాలు మొక్కలు నుండి కూడా లభిస్తుంది. 


విటమిన్ కె (K) (పిల్లో క్వనొన్)


ఈ విటమిన్ కు మరొక పేరు రక్తం గడ్డ కట్టే విటమిన్, పౌష్టికరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ విటమిన్ డి లభ్యమవుతుంది.

లోపం వల్ల కలిగే వ్యాధులు


గాయాలు అయినప్పుడు ఆగని రక్తస్రావం రక్తం గడ్డ కట్టక పోవడం

లభించే ఆహారపదార్ధాలు


పిక్కలు, గుడ్లు, కాలేయం, ఆవు పాలు, ఆకుకూరలు, కాలిఫ్లవర్.


నీటిలో కరిగే విటమిన్లు


B1 (దయమిన్)


మనం తీసుకునే ఆహారంలో బి విటమిన్ లోపించినట్లు అయితే ఆకలి మందగించడం, కాళ్లు చేతులు మొద్దుబారడం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడతాయి. 

లోపం వల్ల కలిగే వ్యాధులు


బెరిబెరి వ్యాధి, పాలి న్యూ రై టి స్

లభించే ఆహారపదార్ధాలు 


ధాన్యాలు, వేరుశనగ, పాలు, కాయగూరలు, మాంసం, చేపలు, తవుడు, గుడ్డు, చిక్కుడు, దంపుడు బియ్యం,  ఉప్పు బియ్యం


B2 (రైబోఫ్లెవిన్) 


దీనికి మరోపేరు ఎల్లో విటమిన్ సి యాంటి కిలోసిస్ విటమిన్ 

లోపం వల్ల కలిగే వ్యాధులు


  • కిటోసిస్ నోరు మూలల్లో పగిలి రక్త స్రావం జరగడం. 
  • గ్లాసైటిస్ నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం. 
  • నాలుగు పై పోతా నోటి మూలల్లో పగలటం కళ్లు మండడం. 
  • చర్మం పై పొలుసులు ఏర్పడడం జరుగుతుంది.

లభించే ఆహార పదార్ధాలు


ఆవు పాలు ,గుడ్లు ,కాలేయం, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, గుడ్డు సొన లలో ఈ విటమిన్ ఎక్కువగా వుంటుంది. ఆఫర్లు లేక పసుపు రంగులో ఉండటానికి గల కారణం రైబోఫ్లెవిన్


B3 (నియాసిన్ లేదా నికోటిన్ ఆమ్లం)


దీనికి మరోపేరు యాంటీ పెల్లగ్రా విటమిన్

లోపం వల్ల కలిగే వ్యాధులు 


పెల్లాగ్రా (చర్మం పైపొర పెలుసుళ్ళ లా వుడిపోతుంది), మతిమరుపు, జ్ఞాపకశక్తి లోపం, నిద్రలో లేచి నడవడం, ప్రపంచంలో అధికంగా చిన్నపిల్లల మరణానికి కారణం.

లభించే ఆహార పదార్ధాలు 


ఈస్ట్ అని శిలీంద్రం, వేరుశనగ, చిలగడదుంప, పాలు,  గుడ్లు, మాంసం, చేపలు మూత్రపిండాలు, కాలేయం, ఈస్టు. 

B5 (పాన్ టోదినిక్ ఆమ్లం)


ఈ విటమిన్ కు మరో పేరు సర్వ విస్తృత విటమిన్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్ జీవక్రియల నియంత్రణలో ఉంచుతుంది

లోపం వల్ల కలిగే వ్యాధులు 


కాళ్లు మండటం, కీళ్లవాతం, కంటి నొప్పి

లభించే ఆహార పదార్ధాలు 


గుడ్డు, చేపలు, పాలు, చిలకడదుంప, కాలేయం, ఈస్ట్, వేరుశనగ

B6 (పైరిడాక్సిన్) 


ఈ విటమిన్ కు మరో పేరు యాంటీ ఎనిమియా విటమిన్

లోపం వల్ల కలిగే వ్యాధులు 


రక్తహీనత, ఉద్వేగము, నాడి మండలంలో లోపాలు ,పిల్లల్లో మోర్చా  

లభించే ఆహార పదార్ధాలు 


పాలు, పప్పు, గుడ్డులోని సొన ,కాలేయం, మాంసం, కూరగాయల, విత్తనాలు, పాలిచ్చే తల్లుల్లో బి6 లోపం ఎక్కువ 

ఉపయోగాలు


జీవక్రియ హిమోగ్లోబిన్ ప్రతి రక్షకాలు తయారీ

B7 (బయోటిన్) 


ఈ విటమిన్ గల మరో పేరు హెచ్ విటమిన్

లోపం వల్ల కలిగే వ్యాధులు 


కండరాల నొప్పులు, నాడీ మండలంలో తేడాలు, అలసట

లభించే ఆహార పదార్ధాలు 


పప్పులు, గింజలు, కాయగూరలు, కాలేయం, సల్ఫర్ ముఖం కలిగిన విటమిన్ బయోటిన్


B9 (ఫోలిక్ ఆమ్లం) 


ఈ విటమిన్ గల మరో పేరు పొలసిస్

లోపం వల్ల కలిగే వ్యాధులు 


రక్తహీనత తెల్లరక్తకణాలు నష్టపోవటం, మానసిక రుగ్మతలు,

లభించే ఆహార పదార్ధాలు 


కాలేయం, మాంసం, గుడ్లు, పాలు, ధాన్యాలు, ఆకు కూరలు.

గర్భవతులకు ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా అవసరం


B12 (సైనో కోబాలమిన్) 


ఈ విటమిన్ గల మరో పేరు యాంటీ పెర్నిసియస్ ఎనీమియా విటమిన్

లోపం వల్ల కలిగే వ్యాధులు 


హానికరమైన రక్తహీనత, కేంద్ర నాడీమండలంపై సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ చాలా అవసరం. 

లభించే ఆహార పదార్ధాలు 


పాలు, మాంసం, కాలేయంలో  ఈ విటమిన్ లభిస్తుంది. పేగు లోని బ్యాక్టీరియాలు దీన్ని చేసి శరీరానికి అందిస్తాయ. 

విటమిన్ బి12 గుడ్డు ఈకో బ్యాక్టీరియాలో లభ్యం

విటమిన్ సి (అస్కరిచ్ ఆమ్లం)


యాంటీ స్కర్వి విటమిన్ అని పిలుస్తారు

లోపం వల్ల కలిగే వ్యాధులు 


స్కర్వి ,రోగ నిరోధక శక్తి తగ్గటం, గాయాలు మానకపోవడం

లభించే ఆహార పదార్ధాలు 


సిట్రస్ పండ్లు, ఉసిరి, జామ, తాజాపండ్లు, మామిడి . సి విటమిన్ ఎక్కువగా ఉండే ఫలం ఉసిరి

సి విటమిన్ విధులు 


గాయాలను మాన్పే గుణం, విరిగిన ఎముకలు అతికించూట, యాంటీ క్యాన్సర్, యాంటి ఆక్సిడెంట్ గా పనిచేయటం, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. 

పాలు


పాలలో సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. పెరిగే పిల్లలకు ఇది అతి ముఖ్యమైన ఆహారం పాలలో ఉండే ప్రోటీన్, కేసిన్ పాలలోని కొవ్వు లాక్టిక్ ఆమ్లం, పాలలోని ఎంజాయ్ లాక్టేజ్ పాల స్వచ్ఛతను కొలిచే పరికరం లాక్టోమీటర్ఆవు పాల కంటే ఎక్కువగా గేదె పాలలో వెన్న శాతం ఉంటుంది.

పాలు దాని ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన విప్లవం శ్వేత విప్లవం. దీనిలో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ మిల్క్ మాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్ ఇతను గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ స్థాపించారు. పాలను శుద్ధిచేసే ప్రక్రియ పాత్ర చేసిన గోన్న వ్యక్తి లూయీ పాశ్చర్

విటమిన్లు - చెడు ప్రభావము



మనిషి ఆరోగ్యంగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరమెంతోవుంది. విటమిన్ల లోపము వలన ఎన్నో వ్యాధులు వచ్చినా సదరు లోపాన్నిపూరించినట్లైతే ఆయా వ్యాధులు ఇట్టే మాయమవుతాయి. 
Different types of vitamins in tablets
టాబ్లెట్ విటమిన్ 


అయితే వచ్చిన చిక్కేమిటంటే విటమిన్ల లోపాలను పూరించే ఆదుర్దాలో విటమిన్లు పుష్కలముగా ఉండే తాజా పండ్లు, ఆకు కూరలకు బదులు ఏకంగా విటమిన్ గుళికలు మింగడము వల్ల ప్రయోజనానికి బదులు కీడే ఎక్కువ జరుగుతుందని ఐరోపా శాస్త్రజ్ఞులు అంటున్నారు. 

డెన్మార్క్  లోని కోపెన్ హెగన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన 'గోరన్ బెలకోవిచ్' నాయకత్వములో జరిగిన పరిశోధనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, బీటాకెరోటిన్లను గుళికల రూపంలో తీసుకుంటే ఏకంగా ప్రాణహాని సంభవిస్తుందని తేలింది. 

అయితే విటమిన్ సి, సెలీనియం లను ఈవిధంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదన్నారు. గతంలో కొన్ని పరిశీలనలు విటమిన్ గుళికలలో వుండే యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపాయి. 

ప్రస్తుత పరిశోధనా ఫలితాలు అందుకు విరుద్ధముగా ఉన్నాయి. ఒక సందర్భంలో 180,938 మంది ప్రజలపై చేసిన పరిశోధనల వల్ల 5 శాతము ప్రజలు విటమిన్ గుళికల వలన మరణించేరని తేలింది. 

వివిధ రకాల విటమిన్లు వేరు వేరుగా పరిశీలించినపుడు

  • బీటా కెరోటిన్ వల్ల 7 శాతము 
  • విటమిన్ A వల్ల 16 శాతము 
  • విటమిన్ E వల్ల 4 శాతము మంది మరణించారు అని పరిశోధనల వల్ల తెలిసింది. 
  • సెలీనియం వల్ల 10 శాతము మరణపు రేటు తగ్గిందని గమనించార.  
కాబట్టి విటమిన్లు మన శరీరం కి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ