ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్.  కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది.  మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ.  పాలును, పెరుగుగా మారే విధానం  (Process of turning milk into

సునామీలు విపత్తు కారణాలు

సునామి  సునామీలు విపత్తు కారణాలు  సునామి అర్థం సునామీ అనే మాట జపనీస్ భాష నుండి వచ్చింది. ఇది సో, నామి అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. సో అనగా వాడరేవు, నామీ అనగా అలలు అని అర్థ. సునామి అంటే మహాసముద్రంలో భారీ పరిమాణంలో నీరు స్థానభ్రంశం చెందడం వలన సంభవించే నీటి తరంగాలు వరుస అని. తమిళంలో సునామీ నీ అజి పెరలి అంటారు. క్రీస్తుపూర్వం 326 భారతదేశంలో మొట్టమొదటి సునామీ సంభవించింది. సునామీ విపత్తులు మహాసముద్రం వంటి అధిక మొత్తం లో నీరు శీఘ్ర స్థానభ్రంశం జరగటం వల్ల ఒక సునామ సముద్ర కెరటం ఏర్పడుతుంది. దీనిని సునామీ అని అంటారు.

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్

మన చుట్టూ ఉండే మొక్కలు వాటి భాగాలు

.  మన చుట్టూ ఉండే మొక్కలు వాటి భాగా లు  మన చుట్టూ ఎన్నో మొక్కలు, చెట్లు ఉన్నాయి వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది .భూమి మీద మనుషులు జంతువులు ఉన్నట్లే చెట్లు మొక్కలు కూడా ఉన్నాయి .వీటిలో కొన్ని చిన్నవి పెద్దవి ఇంకా కొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి.ఉన్నట్లు మాదిరిగానే మొక్కలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి . మన చుట్టూ చెట్లు మొక్కలు ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అడవులలో అనేక రకాల చెట్లు ఉంటాయి ఇవి భూమిపై పచ్చదనాన్ని కాపాడతాయి అడవులు భూమ్మీద మొత్తం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు ఉండాలి కానీ రానురాను అడవుల విస్తీర్ణం మనదేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21 శాతం మాత్రమే ఉన్నాయి అడవుల విస్తీర్ణం తగ్గటం వల్ల పక్షులు జంతువులు వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి నదులు ఎండిపోతున్నాయి భూ ఉపరితలం వేడెక్కుతున్న సముద్ర మట్టం పెరుగుతున్నదని వాతావరణంలో కాలుష్యం పెరిగి సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎట్లా అయితే ఈ భూమి మీద జీవజాలం మనుగడ అంతరించిపోతుంది దీన్ని అధిగమించడానికి ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా అందులో భాగంగానే అటవీ సంపదను కాపాడుకోవాలి. చెట్లను పెంచాలి ఎ

జంతువుల జీవన విధానం

జంతువుల జీవన విధానం జీవవైవిద్యంలో మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు .అందుకే మనుషులను సంఘజీవులు అంటారు. మనందరికీ ఒకరితో ఒకరం సహకరించుకోవాలి ఒకరిపై ఒకరు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉండాలి. జీవించడానికి అవసరమైన ఆహారాన్ని, దుస్తులను, రవాణా సౌకర్యాలు మొదలగు వాటిని సమకూర్చుకుంటారు మరి జంతువులు ఎలా జీవిస్తాయి ఏం చేస్తాయి వాటి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.  ఏనుగుల జీవన విధానం అడవుల్లో నివసించే ఏనుగులు గుంపులు లో ఉంటాయి ఒక గుంపులో 10 నుండి 12 వరకు ఏనుగులు ఉంటాయి. వాటి పిల్లలు కూడా ఉంటాయి. వీటిలో ఎక్కువగా చిన్నవిగా ఉంటాయి. 15 ఏళ్ల వయసు రాగానే సాధారణంగా పెద్ద ఏనుగులుగా కనిపిస్తాయి. ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇది ఉదయాన్నే పెద్దగా అరుస్తుంది, ఆహారం కోసం బయల్దేరుతుంది. ఏనుగుల గుంపు అంత ఒక ప్రాంతానికి చేరుకుని కావాల్సినంత ఆకులు నీటిని ఆనందంగా తీసుకుంటాయి. పెద్ద పులుల జీవన విధానం  పెద్ద పులులు బాగా వేటాడే గలవు. పులి పిల్లలకు పుట్టినపుడు వేటడడం ఎలాగో తెలియదు. పులులు గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించీ వేటాటడం నేర్చుకుంటాయి. పులుల గుంపుతో వాటి పిల్లలు ఆటడుకుంటు అన్ని విషయాలు నేర్చుకుంటాం

సహజ వనరులు భూగర్భజలాల అడవులు

సహజ వనరులు నీరు నేల అడవులు వృక్ష జంతువుల జలాలు మొదలైన సహజ వనరులు గురించి వాటిని సంరక్షించే విధానాల గురించి మనం క్రింద తరగతిలో తెలుసుకున్నాం మానవ కార్యకలాపాల వల్ల సహజ వనరుల కలుషితం అవడం గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ భూమిపై సహజవనరులు ఎంతో పుష్కలంగా ఉన్నాయి కానీ వీటిని మనం సరైన రీతిలో వినియోగించటం లేదు సహజవనరులను ప్రభావితం చేసే మానవ విధానాలు వనరులను సుస్థిరపరచుకుంటు సంరక్షించే ప్రయత్నాల గురించి మనం తెలుసుకుందాం. రెండు గ్రామాల్లో భూగర్భజలాల పరిస్థితి గ్రామం 1 లో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయి గ్రామంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నది ఈ రెండు గ్రామాల్లోనూ భూగర్భ జలాల పరిస్థితి సర్వే చేశారు బావుల ద్వారా నీటి పారుదల నీటి వసతి దాని అందుబాటు పై పూర్తి అవగాహన కు బావుల గణాంకాలు సేకరించారు సొంత బావులు ఉన్న 25 కుటుంబాల యొక్క సామాజిక ఆర్థిక అంశాలను సంబంధించిన సమాచారాన్ని మరొక ప్రశ్నావళి ద్వారా వివరంగా సేకరించారు గత ఐదు సంవత్సరాల నుండి భూగర్భ జలాలు అందుబాటులో వచ్చిన మార్పులను తెలుసుకుందాం. గ్రామం 2 లో బావులకు ప్రత్యామ్నాయాలు లేవు గ్రామం మొదట్లో ఉండే ఒక చెరువు ఇంకుడు చెరువు గా మార్చడం వలన నీటి స

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ