ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్.  కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది.  మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ.  పాలును, పెరుగుగా మారే విధానం  (Process of turning milk into

ప్లాస్టిక్ వాడకం- పర్యావరణ కాలుష్యం ఏర్పడడంమన పర్యావరణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే కాలుష్యం  


ప్లాస్టిక్ ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట. ప్లాస్టిక్ దీని వల్ల మనకి వచ్చే సమస్యలు ఏంటి అనేది తేలుసుకోవలసిన అవసరం చాలా వుంది. ప్లాస్టిక్ మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మనం అందరం ప్లాస్టిక్ ఉపయోగించి చాలా సుఖపడ్డాం కాని, ఆ సుఖం వెనుక, మన ప్రాణాలు తీసే మహమ్మారి వుంది. ప్రకృతినీ నాశనం చేసే, కాలుష్యం వుంది.

Plastic bottels and plastic cover are harmful for our environment
ప్లాస్టిక్ బొట్టేళ్ళు మరియు కవర్లు 

ప్లాస్టిక్ పుట్టుక ఎప్పుడు జరిగింది 


ప్లాస్టిక్ ఆవిర్భావం 1839లో జరిగింది. పర్యావణానికిి ప్లాస్టిక్ పెను ప్రమాదం. ప్లాస్టిక్ పాలిమర్ మరియు మొనోమర్లు యూనిట్ లని కలిగి వుండే పెద్ద అణువులు. ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే పదార్థ అణువులో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలలో తయారయ్యే పదార్థం. ప్లాస్టిక్ తయారీలో వాడే మూల పదార్థం ముడి చమురు.

ప్లాస్టిక్  ఉత్పత్తి ఎలా జరుగును 

ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణం ప్రపంచ శ్రేష్టమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు 7 మిలియన్ బ్యారెల్స్ పెట్రోలియం ఖర్చు అవుతుంది. పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్ తయారీ ఖర్చు తో పాటు పర్యావరణంకి హని కలుగుతుంది. 1930వ సవత్సరంలో ప్లాస్టిక్ పర్యావరణానికి హాని అనర్థం అని బయిట పడింది. 1999లో కేంద్రం లో పర్యావరణానికి అటవీ మంత్రత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ లో 11 కిలోలు వినియోగం అవుతుంది. అమెరికా 109 కిలోల 38 కిలోలు 2018 నాటికి ప్రపంచ ప్లాస్టిక్ ఉత్పత్తి 380 మిలియన్ టన్నులు.

ప్లాస్టిక్ సంచులు వల్ల కలిగే సమస్యలు


ప్లాస్టిక్ సంచులు సరిగా పారవేయకపోతే డ్రైనేజీ సిస్టమ్ లోకి వెళ్లి వాటిని ముడి వేయడం వలన అశుభ్రమైన, వాతావరణం ఏర్పడుతంది రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలో శ్రవించి నీటిని కలుషితం చేస్తాయి. ప్లాస్టిక్ వలన ఏర్పడు వ్యర్థాలు భూమిలో కలవవు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే సమస్యలు


ప్లాస్టిక్ వినయోగం వలన వాతావరణం కాలుష్యం తో సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు వల్ల భూమిని కాపాడే ఓజోన్ పొర కు భారీ స్థాయిలో చిల్లు పడుతుంది. జీవరాశిలో శ్వాస, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు వుంది. ప్లాస్టిక్ తగలబెట్టడం వలన డ్రేయిక్సిన్ వాయువు గాలిలో కలిసి కాన్సర్ కు కారణమవుతుంది. ప్రసాదాలు, దేవుడికి సమర్పించే పులు ఈ ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్తున్నారు.

సులభంగా ఉపయోగించగలగడం, తేలికగా ఉండటం, మన్నిక, చౌకధరల్లో లభించడం,  తడవకపోవడం వంటి సుగుణాల వల్ల ప్లాస్టిక్‌ అత్యంత వేగంగా ప్రజాజీవితంలో భాగమైంది. ఉదయం లేవగానే చేసుకునే బ్రష్‌ నుండి టబ్‌లు, మగ్‌లు, బకెట్‌లు దువ్వెనలు, బెల్టులు, వాటర్‌ బాటిల్స్‌, లంచ్‌ బాక్స్‌లు, కుర్చీలు, ఇలా మన జీవితం మొత్తం ప్లాస్టిక్‌తో ముడిపడిపోయింది.

కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌, క్యారీ బ్యాగులు, ప్లేట్లు, టీగ్లాసులు, స్ట్రాలు ఇలా ప్రతి ఒక్కటి విస్తృత ఉపయోగంలో ఉంది. అయితే సింథటిక్‌ సెమీసింథటిక్‌ రసాయన ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌ కాలుష్యం నేడు భూతంలా తయారై మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్లాస్టిక్‌ తయారీ దశ నుండి సముద్రాలను చేరే దశవరకు కణాలుగా గాలిలో కలవడం, విషరసాయనాలను విడుదల చేయడం ద్వారా జల కాలుష్యం, నేల కాలుష్యం మొదలగు పర్యావరణం కాలుష్యం ఏర్పడుతుంది.

ఇరవైవ శతాబ్దంలో విప్లవాత్మక ఉత్పత్తిగా ప్రసిద్ధిపొంది మానవ జీవితాన్ని ఎంతో సౌకర్యవంతం చేసిన ‘ప్లాస్టిక్‌కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వాడ కాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోడీ తరచుగా చెబుతున్నారు. జీవజాతి ఆరోగ్యాన్ని కబళిస్తున్న ప్లాస్టిక్‌ను ఇప్పటికే 60 దేశాలు నిషేధించాయి. మనదేశంలో సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, నాగాలాండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో నిషేధించగా మరికొన్ని రాష్ట్రాలు నిషేధ బాటలో పయనిస్తున్నాయి.

ప్లాస్టిక్ వల్ల లాభాలు 

ప్లాస్టిక్ వస్తువులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా వుంటాయి. స్టీలు వస్తువుల్లా ఎక్కువ ఖరీదు కూడా కాదు. మట్టి వస్తువుల్లా త్వరగా పగిలి పోవు. నీళ్లు తగలగానే పాడవవు.

ప్లాస్టిక్ వల్ల నష్టాలు


ప్లాస్టిక్ మట్టిలో కలవదు. ఒక పర్యావరణ ప్రమాదం. మట్టి అంత ప్లాస్టిక్ మయం అవుతుంది. అన్ని సంవత్సరాలు ఐన భూమిలో అలా వుండిపోయాయి పంటలు పండకుండ చేస్తాయి. ప్లాస్టిక్ పాలిథిన్ సంచులు నదులు, చెరువులు, కలువుల్లో వుండి నీటిలో వున్న చేపలు, కప్పలు, చనిపోయటట్టు చేస్తున్నాయి. వాటిని కాల్చితే కరిగిన ఆ ప్లాస్టిక్ నుండి విష వాయువులు విడుదలయి జీవకోటి కి ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ప్లాస్టిక్ వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా వున్నాయి. అందుకే కాగితంతో తయారు చేసిన సంచులని వాడమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ కాగితం సంచూలని తయారు చేయడం వల్ల చాలా చెట్లని నరకాల్సి వుంటుంది. కానీ మన అవసరానికి మించి వాడకుండా మన అవసరం వున్నంత వరకు వాడడం లో తప్పు కాదు. ప్రకృతి వనరులు అవసరాలుకి వాడుకోవడానికి వున్నాయి కాని వృధా చేసేంత లా లేవు. వీలైనపుడు ఒక్క మొక్క ఐన నాటి పెంచుతూ వుండాలి. ప్లాస్టిక్ వస్తువుల తయారీలో వినియోగించే ప్లాస్టిక్ పదార్థం మనిషి చర్మం పీల్చుకుని చర్మ వ్యాధి సంభవిస్తుంది. ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసుల్లో వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కాన్సర్ కు దారి తీస్తుంది. పశువులు పశుగ్రాసంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. వీటి ద్వారా కొత్త రోగాలు వస్తున్నాయి.వర్షపు జలలు భూగర్భంలో చేరకుండా అడ్డుకుంటున్నాయి.


ప్లాస్టిక్ వల్ల సమస్యలు

సులభంగా, ఉపయోగించటం సులువు, తేలిక వుండడం, మన్నిక చౌక ధరల్లో లభించం, తడవకపోవడం వంటి సుగుణాల వల్ల ప్లాస్టిక్ అత్యంత వేగంగా ప్రజా జీవితంలో భాగమైంది. బ్రష్, టబ్, మగ్, బకెట్, దువ్వెన, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, కుర్చీలు, ఇలా ప్రతిదీ మన జీవితంలో ప్లాస్టిక్ తో ముడి పడి వుంది. ఐన ప్లాస్టిక్ కాలుష్యం నేడు భూతంల తయారై మానవ మనుగడని  ప్రశ్నార్థకం చేస్తుంది. ప్లాస్టిక్ కణాలుగా కలవడం, విష రసాయనాలు ఉత్పత్తి చేయడం వలన జల కాలుష్యం, నేల కాలుష్యం, మొదలగు పర్యావరణం కాలుష్యం అవుతుంది. 20వ శతాబ్దంలో విప్లవాత్మక ఉత్పత్తిగా ప్రసిద్ది పొందిన మానవ జీవితాన్ని సౌకర్యవతంగా చేసిన, ప్లాస్టిక్ కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పటికీ 60 దేశాలు నిషేధించాయి.

ప్రజలు ఆరోగ్యాన్ని తినేస్తున్న ప్లాస్టిక్

ప్లాస్టిక్‌ కాలుష్యం జీవజాతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. దేశంలోని పంపు నీటిలో 72 శాతం ప్లాస్టిక్‌ రేణువ్ఞలు ఉన్నట్లు తేలింది. ఒక వ్యక్తి సంవత్సరానికి మూడువేల నుండి నాలుగువేల సూక్ష్మప్లాస్టిక్‌ కణాలను లేదా 250 గ్రాముల బరువు గల ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నారని తేలింది. ఈ కాలుష్యం నీటి వనరులలో చేరి చేపల ద్వారా మన ఆహారంలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్టిక్‌ వల్ల మురికి చేరి దోమలు పెరుగుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. మనశరీరంలో హార్మోన్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా ఎండోక్రైన్‌ వ్యాధులు రావడం, వ్యంధత్వానికి దారితీయడం జరుగుతుంది. 2019లో ప్లాస్టిక్‌, పర్యావరణ నివేదిక ప్రకారం ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల 850మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్ ‌కు సమానమైన గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారం జరిగింది.

ఎటు చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే. మురుగు కాల్వలు, నదులు, పంట కాలువల్లో సైతం పాలిథిన్‌ సంచులే దర్శనమిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పర్యావరణానికి పెనుముప్పు తెస్తోన్న ప్లాస్టిక్‌ భూతాన్ని పెంచి పోషిస్తున్నారు. అధికారులు కళ్లప్పగించి చూస్తుండడంతో విచ్చలవిడిగా వినియోగం జరుగుతోంది. మరోవైపు న్యూస్‌పేపర్లలో చిరుతిళ్లు, ఆహార పదార్థాల సరఫరా నిషేధమని చెప్పినా చెవికెక్కని పరిస్థితి. ఫలితంగా ఆహారం మాటున ఇంటికి అనారోగ్యాన్ని మోసుకెళ్లుతున్నారనేది అక్షరసత్యం. 2016లో ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి వచ్చినా దస్త్రాలకే పరిమితమైంది. ఆ తర్వాత భారత ఆహార భద్రతా ప్రమాణాల సంఘం ఆదేశాల ప్రకారం ఆహారం ప్లాస్టిక్‌, న్యూస్‌ పేపర్లలో ప్యాక్‌ చేయడం, సరఫరా చేయడం నిషేధమంటూ ఈ ఏడాది జనవరి మూడున ప్రకటించారు. 

జులై ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి ఖచ్చితంగా తేవాలని సూచించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్లు వాడకూడదని చట్టం చెబుతోంది. పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, టిఫిన్‌, కర్రీపాయింట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌, చికెన్‌, మటన్‌ సెంటర్లు కూడా ఎక్కడపడితే అక్కడ పాలిథిన్‌ కవర్లు ఉపయోగిస్తున్నారు. వ్యాపారులు వినియోగదారులకు నిర్భయంగా ఎంచక్కా ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి ఇచ్చేస్తున్నారు. వీటితోపాటు టీ కప్పులు, ప్లేట్లు, ప్లాస్టిక్‌వే వాడుతున్నారు. ఇలా 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే కవర్లను ఉపయోగిస్తుండటం కలవరపెడుతోంది. 

పట్టణ, నగర కేంద్రాలతో పాటు గ్రామాలలో సైతం ఎక్కువ మంది వీధి వ్యాపారులు, హోటళ్లు, వందకు పైగా టిఫిన్‌ సెంటర్లు, లైసెన్సు దుకాణాలలో అధిక శాతం ప్లాస్టిక్‌ కవర్లను ప్రోత్సహిస్తున్నాయి. నియంత్రణ, ప్రత్యామ్నాయం ఏవి? నిషేధిత కవర్లు అమ్ముతున్నట్లు కనిపిస్తే దుకాణదారుడికి జరిమానా విధించి కేసులు నమోదు చేయాల్సిన అధికారులు ఆ దిశలో అడుగులు వేయడం లేదు. 

పండ్లు, ఇతర పదార్థాలు తీసుకుని కవర్లు ఉన్నాయని తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ప్లాస్టిక్‌ వినియోగానికి ప్రత్యామ్నాయం జూట్‌ బ్యాగుల వినియోగం, తయారీపై దృష్టిపెట్టలేదనే చెప్పాలి. ఆహారం ఎంత శుద్ధిగా తయారు చేసినా సక్రమంగా ప్యాక్‌ చేయకపోవడం వల్ల అది విషపూరితమయ్యే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు కేన్సర్‌ సంబంధిత అనారోగ్య సమస్యల బారినపడతారు. 

ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసిన వేడి పదార్థాలు తినడం వల్ల కిడ్నీసమస్యలు, అన్నవాహిక, సంతానలేమి, ఇతర సమస్యల బారినపడతారు. వేడిపదార్థాలు ప్లాస్టిక్‌తో కలిసినప్పుడు ప్రమాదశాతం తీవ్రమవ్ఞతుంది. ఆహార కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజా అవగాహన సదస్సులు ఆహార భద్రతా ప్రమాణ అధికారులు నిర్వహించాల్సి ఉంది. ప్లాస్టిక్‌, పేపరు వల్ల వచ్చే అనర్థాలపై నగరపాలక అధికారులు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వారంలో ఒక మనిషి సుమారుగా ఐదు గ్రామాలు ప్లాస్టిక్‌ తీసుకుంటున్నాడని ఇటీవల ఒక అధ్యయనం తేల్చింది. 

తినే పదార్థాలను భద్రపరచడం మొదలు ఇంట్లో వాడే ఏ వస్తువైనా ప్లాస్టిక్‌తో చేసింది వినియోగించడమే ఇందుకు కారణం. ఇది ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది.


ప్లాస్టిక్ యొక్క నివారణ చర్యలు

ప్లాస్టిక్‌ కుళ్లదు. భూమిలో కలసిపోదు. ఇప్పటికే భూమి పై, సముద్రాలలో వాడి పారేసిన ప్లాస్టిక్‌ వస్తువులు పేరుకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేశాయి. కాల్చినపుడు ప్లాస్టిక్‌ వ్యర్థాలు విష రసాయనాలను వదులుతాయి. వీటితో వన్యప్రాణులు, జలచరాలు, మానవాళి శ్వాసకోశాలు దెబ్బతింటాయి. ప్లాస్టిక్‌ వల్ల ఏడాదికి లక్ష సముద్ర ప్రాణులు, 10 లక్షల సముద్ర పక్షులు చనిపోతున్నాయి. 

శిథిలమయ్యే లోపల ఒక ప్లాస్టిక్‌ సంచి అనేక జంతువులను చంపుతుంది. అయినా జీవితంలో అంతర్భాగమైన ప్లాస్టిక్‌ సాధనాలను వదలలేక పోతున్నాం.

ఇటీవల ప్లాస్టిక్‌ కాలుష్యం పెంచుతున్న దేశాల అధ్యయనం జరిగింది. 2010 గణాంకాల ఆధారంగా 2015 ఫిబ్రవరి 13న విడుదల చేసిన నివేదిక ప్రకారం 192 దేశాలలో ప్రతి ఏడాది 27.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ కాలుష్యం తయారవుతోంది. 

అందులో 1.27 కోట్ల టన్నులు సముద్రాలకు చేరుతోంది. అధిక జనాభా, అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన కాలుష్య కారణాలని శాస్త్రజ్ఞుల విశ్లేషణ. ఇండొనేషియా, ఫిలిప్పైన్స్‌, వియత్నాం, శ్రీలంక ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదులుతున్న దేశాలలో ముందున్నాయి. 

2018 కి ప్లాస్టిక్‌ వ్యర్థాలు 38 కోట్ల టన్నులకు పెరిగాయి. దేశ ఆర్థికాభివృద్ధి స్థాయి, వ్యర్థ పదార్థాల ఉద్గారం, నిర్వహణ, సముద్రతీర ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న జనాభా కాలుష్య కారకాలు. ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఉపయోగం పెరిగింది. పానీయాల సీసాలు, ఆహార పదార్థాల ప్యాకేజీలలో ప్లాస్టిక్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి 11 ఏళ్లకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు రెట్టింపవుతున్నాయి.

ప్రజలు మానసికంగా సిద్ధపడినప్పుడు ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించవచ్చు. ప్రజా ప్రయోజనాలకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు వాడే పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. పునరుపయోగ ఉపాయాలు లేనప్పుడు ప్లాస్టిక్‌ వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రతల్లో కాల్చి విద్యుదుత్పత్తి ప్రక్రియలు చేపట్టాలి. హవాయి, స్వీడన్‌ మొదలగు దేశాల్లో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు.

2002లో ఐర్లాండ్‌ ప్లాస్టిక్‌ సంచులపై 15 సెంట్ల పన్ను (ప్లాస్టాక్స్‌) విధించింది. ఇది ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని బాగా తగ్గించింది. తమ వెంట పునరుపయోగ కప్పులను తెచ్చుకునే వారికి కాఫీ ధరలో రాయితీలు కూడా ఇస్తారు. జపాన్‌ దుకాణాలలో వినియోగదారులను "ప్లాస్టిక్‌ సంచులు కావాలా" అని అడుగుతారు. దీంతో 40 శాతం వినియోగదారులు తమతో సంచులు తెచ్చుకోటానికి అలవాటు పడ్డారు. 

మనం కూడా దుకాణదారులను ప్లాస్టిక్‌ రహితానికి ప్రోత్సహించాలి. సమస్య తీవ్రత అవగతమైతే పరిష్కారాల ఆచరణ సులభమవుతుంది. ప్లాస్టిక్‌ వస్తువులు, ఉత్పత్తుల ప్రత్యామ్నాయాలు అలవర్చుకోవాలి. పానీయాలతో స్ట్రాలు ఇవ్వటం ఆపేయవచ్చు. వ్యాపార వర్గాలు కూడా ఈ దిశలో ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేయాలి. జర్మనీలో ఫ్రీబర్గ్‌ కప్పులు, ఆస్ట్రేలియాలో బూమరాంగ్‌ సంచులు వాడకంలోకి వచ్చాయి. 

ఈ విధంగా వ్యాపారులు, వినియోగదారుల మనస్తత్వాన్ని మార్చవచ్చు. సంపూర్ణ ప్రత్యామ్నాయ సమాచారంతో ప్రజలను చైతన్య పరచాలి. ఆస్ట్రేలియాలో వ్యర్థాలపై యుద్ధం, వ్యర్థాలు లేని వీధులు మొదలైన టీవీ ప్రదర్శనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్లాస్టిక్‌ బదులు ఏ సంచి, ఏ పెట్టె వాడాలో చెప్పాలి. ప్రజలను సమస్యల సృష్టి కర్తలు కాకుండా సామాజిక నిర్మాణంలో భాగస్వాములను చేయాలి.

జాతీయ వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానం రూపొందాలి. ప్రజలకు ప్లాస్టిక్‌ వ్యర్థాల నష్టాలు వివరించాలి. వస్తు వినియోగ నియంత్రణ, వ్యర్థాల సేకరణ, నిర్వహణ, పునరుపయోగం, ఉత్పత్తి-ఉపయోగంలో ప్రజలకు అవగాహన కల్పించాలి. విద్యార్థులకు, యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. 

వ్యర్థ నిర్వహణకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజాల సహాయ సహకారాలు తీసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఈ రంగంలో ఉపాధి కల్పించాలి. వ్యర్థాలు సేకరించి పొట్టపోసుకుంటున్న అభాగ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ ఉపాధిలో నియమించాలి. 

చెత్తలో బతుకుదెరువు వెదుక్కునే పిల్లలను చదువు వైపునకు మళ్ళించాలి. ప్రపంచంలో అమలులోనున్న వ్యర్థాల ఉపయోగ పద్ధతులను పాటించాలి. 

మన దేశానికి అనుకూలమైన కొత్త పద్ధతులను పరిశోధించి ఆవిష్కరించాలి. పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు, వాణిజ్య వర్గాలు మానసిక పరివర్తన దిశగా ప్రజలను ప్రోత్సహించాలి. దీనికి ఆర్థిక, మనస్తత్వ, సామాజిక శాస్త్రాల అంతర్గత అంశాలను అనువర్తింపజేయాలి. 

సమాచార, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు వాడుకోవాలి. అవగాహన ప్రచారాలతో సమాచారాన్ని అందించినంత మాత్రాన మానవ మనస్తత్వం మారదని పరిశోధనల్లో తేలింది. మాధ్యమాలు, ప్రచారాలు సమస్యను ప్రజల దృష్టికి తేగలవు. దృశ్య మాధ్యమాలలో కనిపించే వస్తువులు మన అలవాట్లను ప్రభావితం చేస్తాయి. ప్లాస్టిక్‌ వస్తువులు కాక ఇతర పర్యావరణ పరిరక్షక పరికరాలు కనిపించేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి.

పర్యావరణంతో పాటు సామాజిక, ఆర్థికాంశాలనూ పరిగణించాలి. నిరపాయకర ప్రత్యామ్నాయాలను సూచించాలి. ప్లాస్టిక్‌ నివారణ బాధ్యత మనందరిదీ.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య ( Road safety education)   రవాణా రంగం ( Transport sector) చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది. ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు రవాణా సాధనాలు ( Means of road transport) ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర. బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు

వ్యాధులు, వాటి లక్షణాలు మరియు చికిత్స విధానము

వివిధ రకాల వ్యాధులు, వాటి లక్షణాలు మరియు చికిత్స  విధానము  అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగమ అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. దీని వలన మనకి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది. చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి.  జన్యు సంబంధమైనవి అంతర్గత కారణాలు. వ్యాధుల వ్యాప్తి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - అంటువ్యాధులు. ఇవి వైరస్, బాక్టీరియా, ఫంగస్, ఇతర పరాన్న జీవుల వలన సంక్రమిస్తాయి. జలుబు, క్షయ, తామర, పట్టు పుురుగు వీటికి ఉదాహరణలు. ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని గాలి ద్వారా, కొన్ని కీటకాల ద్వారా, కొన్ని మురికి నీరు లేదా అపరిశుభ్రమైన ఆహారం ద్వారా, మరికొన్ని స్పర్శ వలన వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు  నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు  గాలి ద్వారా వ్యాపించు వ్యాధులు వైరస్ వలన వచ్చే వ్యాధులు జలుబు  పడిస