ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జంక్ ఫుడ్ వలన ఆరోగ్య సమస్యలు మరియు వాటి ప్రభావం


జంక్ ఫుడ్స్ వలన అనారోగ్యం మరియు ఎన్నో రకాల జంక్ ఫుడ్స్ 

సరైన న్య్యూటిషన్ విలువలు లేని సరిపడా కేలరీలు లేని లేదా అనారోగ్య కరమైన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ అంటారు. జంక్ ఫుడ్స్ తినడం వలన అనారోగ్యానికి దారి తియును. 

ఈ పదము మొదట 1972 లో కనుకొన్నారు. జంక్ ఫుడ్స్ లో ఎక్కువ పరిమాణం లో సాచ్యురెట్డే, కొవ్వులు, సాల్ట్, షుగర్ వుంటాయి. ఆరోగ్య కరమైన పండ్లు, కూరగాయల, ఫైబర్ వున్న పదార్థాలు ఈ జంక్ ఫుడ్స్ లో వుండవు.
Junk food effect on the body and its unhealty
Junk Food 

సాధారణం గా ఉప్పు స్నాక్స్ అంటే చిప్స్ క్యాండీ , తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరాల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్, డ్రింక్స్, రెడీ మేడ్ కూల్ డ్రింక్, మసాలా చాట్, పకోడీ , బజ్జీ వంటి స్నాక్ ఫుడ్, మిర్చి బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ టొమాటో కచప్, వెన్న తో కూడిన చాక్లెట్, డ్రింక్, ఐస్ క్రీమ్,, కేక్ లు మొదలైనవి.పిజ్జా బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, కేక్ లు, నూడిల్స్ పిల్లలకు ఎంతగానో నచ్చే జంక్ ఫుడ్స్ 

జంక్ ఫుడ్స్ తింటే ఉాబకాయం వస్తుంది. దీని వలన చిన్న వయసు లోనే బిపి షుగర్ వస్తుంది. డాక్టర్లు ధూమపానం, సిగరెట్లు, మత్తు మందుల లాగ జంక్ ఫుడ్స్ తినడం కూడా ఒక వ్యసనం గా మారుతుందని అంటున్నారు.అంతే కాక మనీషి పై మాదక ద్రవ్యాలు గా దుస్ప్రభవం చూపుతాయని విరు కనుగొన్నారు . 

జంక్ ఫుడ్స్ అంటే బేకరి పదార్థాలు కి అలవాటు పడడం. అది ఉబకాయానికి దారి తీయడం కాకుండా జంక్ ఫుడ్స్ మెదుడి మీద కూడా చాలా ప్రభావం పడుతుంది. ఇందుకు కారణం బేకరి లో వున్న పదార్థాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా వుండడం చేత అనారోగ్యం కలుగుతుంది. జంక్ ఫుడ్స్ వల్ల కలిగే ప్రభావాలు తెలుసుకునేందుకు 3 ఏళ్ళు ఎలుకల పై ప్రయోగాలు చేశారు.అధిక కెలరీలు గల ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడుకి చాలా ప్రభావం పడుతుంది అని.తెలియ చేసారు.


దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫాస్ట్ ఫుడ్ సంస్కతీ


దేశంలో శరవేగంగా జంక్ ఫుడ్స్ సంస్కృతి విస్తరిస్తుంది.ఈ ఫుడ్ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది.దేశం లో గత కొన్ని సంవత్సరాలుగా ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ విస్తరిస్తూ అనూహ్యం గా అభివృద్ధి చెందుతుంది.దేశం లో ప్రజల్లో వచ్చే మార్పులు, సంభవించిన అధిక మార్పులు, ఆదాయాలు భారీగా పెరిగిపోవడం ,ఆహార అభిరుచుల్లో మార్పులు జరగడం లాంటి ప్రజలు కొత్త రుచులు అలవాటు పడడానికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెరగడానికి కారణం అవుతున్నాయి.

భారతీయులు ఎక్కువగా విదేశాలకు వెళ్లి అక్కడ వాటిని సందర్శించదం వలన అక్కడ అలవాట్ల పై మోజు పెంచుకోవడం వల్ల, జీవన విధానం లో మార్పులు చేర్పులు చేయడం వల్ల , తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తున్నరని నిపుణులు అంటున్నారు.దేశం మొత్తం ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బాగా వ్యాప్తి చెందుతుంది.

ఒక ఉదాహరణ మెక్ డోనాల్డ్ రెస్టారెంట్  జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ 

2010 సంవత్సర కాలంలో మెట్రొనగరం లో దాదాపుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అధికం గా 20 శాతం పెరుగుతున్నట్టు అమ్మకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.ఈ జంక్ ఫుడ్స్ మొట్ట మొదటగా 1996లో డిల్లీ లో బసంత్ లోక్ లో మెక్ డొనాల్డ్ ప్రారంభించెను.ప్రస్తుతం మొత్తం 211 రెస్టారెంట్ లలో భారత్ లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో105, పచ్చిమ ప్రాంతాల్లో 106 రెస్టారెంట్ లు వున్నాయి. మెక్ డొనాల్డ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారంట్లు మెట్రో నగరాల్లో పాటు ఇతర నగరాలలో కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. దానికి ఉదాహరణ హర్యానా లో 14పంజాబ్ లో 11 ఉత్తర ప్రదేశ్ లో 32 రెస్టారెంట్ల పని చేస్తున్నాయని ఆయన వివరించారు.దేశం లో పెరుగుతున్న చిన్న కుటుంబాలు, మద్య తరగతి ప్రజలకు తగినంత ఆదాయం రావడం , ఇళ్లలో వంట చేసుకోవడానికి సమయం లేకపోవడం వంటి వాటి వలన ఫాస్ట్ ఫుడ్ రంగం సర వేగంగా అభవృద్ధి చెందుతుంది.
Junk food burger is looks good but unhealty
Junk Food Burger 

భవిష్యత్తు లో కూడా ఈ రంగం చాలా వేగంగా అభవృద్ధి చెందుతుంది అని అనడం లో అతిశయోక్తి లేదు. స్థానిక ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడడం ద్వారా ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు మంచి లాభాలు..గానిస్తున్నాయి.దేశం లో మొట్ట మొదటగా పిజ్జా నీ ప్రవేశ పెట్టమని అది ప్రస్తుతం స్థానిక వినియోగ దారులకు ఆకర్షించింది అని అంతే కాక త్వరలో మరి కొన్ని రుచికరమైన పదార్థాలు ను తయారు చేసాము అనిన్ పిజ్జా హట్ మేనేజర్ ఉమేష కుమార్ తెలిపారు.పిజ్జా బర్గర్లు తినడానికి సులువుగా వుంటాయి కాబట్టి సమయం ఎక్కువ పట్టదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నీ కొన్ని వైవిధ్యమైన ప్రదేశాల్లో స్తాపిస్తున్నమని , ప్రయాణం లో వున్న వారికి కూడా ఆకర్షించేందుకు వ్యాపార కూడలిలో , విమాన అశ్రయల్లో , మెట్రో స్టేషన్ లతో పాటు అనేక నగరాల్లో ప్రవేశ పెట్టినట్టు ఈ ఫుడ్ సెంటర్స్ నీ ప్రవేశ పెట్టారు .

జంక్ ఫుడ్స్ శరీరం పై ప్రభావం 


జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా హానికరం. మరియు దీని వలన శరీరం లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి స్థూలకాయం ఏర్పడుతుంది.వీటితో పాటు జంక్ ఫుడ్స్ తినడం వలన అదికంగా తీసుకోవడం వలన శ్వాస కోశ సమస్యలు , గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు మరియు మధు మెహం వంటి ప్రమాదకర వ్యాధులు కలుగుతాయి.

జంక్ ఫుడ్స్ శరీరానికి కావలసిన పోషకాలు వీటిలో వుండవు..కాని కార్బో హైడ్రేట్, కొవ్వు పదార్థాలు వంటివి హానికర పదార్థాలను నిర్మితమై ఉంటుంది.వీటిలో శరీరానికి కావలసిన అలాంటి పోషక విలువలు వుండవు.కావున జంక్ ఫుడ్ తీసుకునే వారిలో పోషకాలు అందించబడవు.అందువలన వారు త్వరగా అలసటకు గురి అవుతూ ఉంటారు.

గుండె జబ్బులు పై జంక్ ఫుడ్ ప్రభావం 
Junk food having daily may lead to heart disease
Junk Food -Heart Disease 

జంక్ ఫుడ్స్ వలన అనారోగ్యానికి గురి ఐన వారు..చాలా అలసటకు గురి అవుతూ ఉంటారు.జంక్ ఫుడ్స్ లో జీర్ణాశయం లో జీర్ణం చెందించబడని. కొవ్వు పదార్థాలు,నూనెలు అధిక మొత్తం లో వుంటాయి.ఇవి రక్త నాళాల లోపల గోడల వైపు ఏర్పడి ఫలకాలుగా ఏర్పడి రక్త సరఫరాలో అడ్డంకులు కలిగిస్తాయి.ఫలితం గా రక్తం పీడనం అధికం అయ్యి రక్త సరఫరా చేసే గుండెకు ఆటంకం కలిగిస్తాయి 

మధుమేహం పై జంక్ ఫుడ్ ప్రభావం 

మధుమేహం కి గురైన వారు , జీవితాంతం ఈ వ్యాధి వలన కలిగే సమస్యలతో బాధలు పడుతూనే వుండాలి .జంక్ ఫుడ్ అధిక మొత్తం లో ఉప్పు మరియు చక్కెరలను కలిగి వుంటుంది.ఇవి ప్లీహ గ్రంధి నీ ప్రమాదానికి గురి చేసి , ఇన్సులిన్ ఉత్పత్తి నీ తగ్గిస్తుంది.డయాబెటిస్ మిల్లిటిసే వ్యాధి నీ బారిన పడేలా చేస్తుంది.

జంక్ ఫుడ్ కి అలవాటు పడితే వాటికి దూరం గా వుండడానికి కొన్ని మార్గాలు 
మి ఇంట్లో వుండే జంక్ ఫుడ్ నీ తొలగించి మంచి పోషకాలు కలిగిన ఆహారం నీ పదార్ధాలతో నింపండి. ఫలితంగా అనారోగ్య ఆహారానికి బదులు గా ఆరోగ్య ఆహారం తీసుకుంటున్నారని అర్థం.దీని వలన ఆరోగ్యం బావుంటుందని సూచిస్తున్నారు.

వంట గదిలో జంక్ ఫుడ్స్ తీసేసి..ఈ విధంగా పోషకాలు కలిగిన ఆహారం పెట్టడం ద్వారా ఆరోగ్యం కుదిట పడుతుంది. దీనికి తగ్గట్టు వ్యాయామాలు కూడా చేయాలి.

పండ్లు కూరగాయలు 
Avoid Junk food and have fruits and vegetables in your daily life
Fruits and Vegetables 

వీటితో పాటు గా పండ్లు కూరగాయలు ను మి ఆహార పదార్థాలలో కలుపుకోండీ. రోజు ఆరోగ్యకర ఆహారం నీ తీసుకోవడం వలన భోజనం మద్యలో జంక్ ఫుడ్ తీసుకునే అలవాటు మర్చిపోతారు.ఒక వేళ స్నాక్స్ తినాలి అనిపిస్తే వివిధ రకాల పండ్లను స్నాక్స్ తో కలిపి తినండి.పండ్లు మరియు కూరగాయలు నుండి శరీరానికు కావలసిన పోషకాలు అందుతాయి.

నీరు, మన శరీరం పై ప్రభావం 

నీరు నీ ఎక్కువగా తాగండి. నీరు మాత్రమే శరీర వ్యవస్థలో ఆరోగ్యంగా శుభ్ర పరిచి
శరీరాన్ని డీ హైడ్రేషన్ కు అనుకూలంగా వుంచుతుంది .జంక్ ఫుడ్స్ పై ఉన్న వ్యామోహాన్ని చంపేస్తుంది .ప్రతి రోజూ 6నుండి 8 గ్లాస్ ల నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. ఫలితంగా మి జీవక్రియ రేటు పెరగటమే కాకుండా శరీరం లో వుండే విష మరియు హానికర పదార్థాలు కూడా తొలగిపోతాయి.

జంక్ ఫుడ్స్ తో జాగ్రత్త

బయట ఆహారం కన్న ఇంట్లో ఆహారం చాలా మేలని మన పెద్దలు అన్ని చెబుతూ ఉంటారు.ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటను పెడ చెవిన పెట్టీ ఫాస్ట్ ఫుడ్ న్ను ఆశ్రయిస్తున్నారు. జంక్ ఫుడ్స్ ను తింటున్నాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయి. అటువంటి  వాటి వల్ల మానవ శరీరం లో రోగ నిరోధక శక్తి అంతరించపోతుంది. కాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులూ వస్తాయి. సంతాన సాఫల్య లోపం ఏర్పడుతంది అని ఒక అధ్యయనం లో తేలింది 

బయట దొరికే ఫుడ్ లో కల్తీ నూనెలు వుంటాయి. అని సుచి శుభ్రం వుండదని అందుకే ఇవి ప్రమాదకరం అని ఇంతకు ముందు అంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు.తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి.పిఎఫె ఎ ఎస్ గా వుండే రసాయనాలు ఈ జంక్ ఫుడ్ లో వున్నట్టు తెలింది. 

ప్యాకేజ్ ల ద్వారా ఈ రసాయనాలు జంక్ ఫుడ్ లోకి వస్తున్నాయని , అలాగే ఓవెన్ లో తయారు చేసే పాప్ కార్న్ లో కూడా రసాయనాలు దండిగా వున్నాయి అని పరిశోధకులు అంటున్నారు.

కొన్ని రకాల ప్యాకేజ్ మెటీరియల్ నీ రసాయనాలు ఉపయోగించి తయారు చేయడం వల్ల రసాయనాలు ఆహార పదార్థాలను లోకి రావడం కాకుండా కలుషిత నీటి ద్వారా , కలుషిత పరిసరాల ద్వారా రసాయనాలు ఆహార పదార్థాలు లోనికి చేరుతున్నాయి. 

జంక్ ఆహార పదార్థాలు, వాటి ప్యాకింగ్ ల పై అధ్యయనం జరపడం తో పాటు ఇంటి వంటకాలు , బయిట వంటకాలు తింటున్న దాదాపు పది వేల మంది అమెరికన్ల రికార్థులు ను పరిశీలించి రసాయనాలు గురించి నిర్దారణ వచ్చినట్లు పరిశోధకులు అంటున్నారు. 

వీటి వలన ఇంటి వంటకాలు అన్ని రకాల మేలు అని పరిశోధకుల మరోసారి తేల్చి చెప్పారు.జంక్ ఫుడ్స్ వలన కలిగే నష్టం గురించి కూడా వాటి వలన కలిగే ఆరోగ్య నష్టాలు గురించి వివరించారు.

నిజానికి జంక్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికు మేలు చేస్తాయి

ప్రస్తుత రోజుల్లో మన ఇండియన్ లో హెల్త్ కండిషన్ బాగా పెరిగింది.చాలా వరుకు యవ్వనం లో వున్నవారు హెల్త్ నీ బాగా ఫాలో అవుతున్నారు.ముఖ్యం గా కొత్తలో చాలా మోజుగా తిన్న తెప్తింగ్ ఎండ్ కలర్ ఫుడ్ జంక్ ఫుడ్స్ కు ఇప్పుడు 100 మైళ్ల దూరంలో వుంటున్నారు. వీటిలో పోషకాలు, నుట్రిషన్ లేవని తెలిసిన కూడా వాటి ప్రస్తావనకు వెళ్ళడం లేదు.ఐతే జంక్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికు మంచిదని చెబితే ఎప్పుడో ఒక్కసారి తినడం వలన ఆరోగ్యానికు మంచిదని చెబుతారు.కొందరు ఆరోగ్య మరియు ఆహార నిపణులు అభిప్రాయం జంక్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి మంచివే అని చెబుతున్నారు.వీటిని ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని రకాల జంక్ ఫుడ్స్ లో కొన్ని రకాల హెల్త్ టిప్స్ వున్నాయి.అవి మిమ్మల్ని హెల్తీగా, మంచి షేప్ లో వుంచడానికి సహాయ పడుతుంది.

మనం చాలా వరుకు అన్ హెల్తీ ఫుడ్స్ గా పిలవబడుతుంది. ఈ ఆహారాల్లో నుత్రిషన్ మరియు పోషక విలువలు మన శరీరం లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫిట్ గా మరియు హెల్తీ గా వుంటారు. ఎనర్జీతో వుంటారని నిపుణులు అంటున్నారు.జంక్ ఫుడ్స్ లో కంటే చాక్లెట్స్ లో కాలరీలు అధికం గా వున్నాయి.

వీటిలో కొన్ని రకాల జంక్ ఫుడ్స్ ను చూద్దాం 

సలాడ్ డ్రెస్సింగ్

చాలా మంది లో ఫ్యాట్ సలాడ్ డ్రెస్సింగ్ ను తీసుకుంటారు.ఇందులో కేలరీలు , ఫ్యాట్ తక్కువని అనుకుంటారు.కాని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం రెగ్యులర్ డ్రెస్సింగ్ పదార్థాల కంటే లో ఫ్యాట్ డ్రెస్సింగ్ పదార్థాలు అలాంటి వ్యత్యాసాలు వుండవని తెలుపుతున్నారు.

చాక్లట్స్

చాక్లెట్స్ లో అధిక మొత్తం లో ఫాలి ఫినాల్స్ వున్నాయి అన్న సంగతి నికు తెలుసా ఇవి మోర్ట్ లిటిని 30శాతం వరుకు తగ్గించే అధిక ఫాలో ఫీనాల్స్ వుంటాయి.అయితే జంక్ ఫుడ్స్ లో కూడా అంత కంటే ఎక్కువ గా వుండడం వలన కాన్సర్ తో పోరాడే గుణాలు అతి ఎక్కువగా వున్నాయి.

క్రీమ్స్

విప్పడ్ క్రీమ్ లు, సోరే క్రీమ్ లు హెల్తీ జంక్ ఫుడ్స్ లో దాగి వున్న ఆహారం. అవును ఎందుకంటే వీటిలో శాచ్యు రేటెడ్ ఫ్యాట్ కలిగి వుండడం వలన ఇవి మీరు రోజు తీసుకుని ఒక కప్పు పాలకు సమానం అవుతాయి.

బట్టర్

మీరు కనుక స్ట్రీట్ డైట్ ఫాలో అవుతున్న సంగతి నిజమేనా ఐతే అందులో నివారించాల్సిన ఆహారం లో డైరీ ప్రొడక్ట్స్ బట్టర్ మరియు చీస్ కని ఈ జంక్ ఫుడ్స్ నిజానికు మనకి చాలా ఆరోగ్య కరమైనదని నికు తెలుసా బట్టర్ లో ఫ్యాట్ విటమిన్లు, విటమిన్ సి, డి, ఇ,మరియు కె లు పోషణకు చాలా సహాయ పడుతుంది అనే సంగతి మీకు తెలుసా 

బీర్

బీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఒక కప్పు బీర్ ఒక కప్పు రెడ్ వైన్ తో సమానం.అందుకే వీటితో తయారు అయ్యే జంక్ ఫుడ్స్ కూడా ఆరోగ్యకరం.మరియు బీర్ బోన్ దేన్సిటి ని పెంచడంలో కూడా చాలా సహాయ పడుతుంది అని నిపుణులు అంటున్నారు.

పాప్ కార్న్

పాప్ కార్న్ కూడా చాలా మంచి ఆరోగ్య కరమైన జంక్ ఫుడ్స్.ఎందుకంటే వీటిలో అధిక శాతం లో ఫాలో ఫినల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.హార్ట్ డిసీజ్ మరియు కొన్ని రకాల కాన్సర్ నుండి రక్షణ ను ఇస్తాయి.

టొమాటో కచప్

టొమాటో కఛప్ ను టమాటో లతో తయారు చేస్తారు .వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది లైకోపిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి కార్డియో వ్యస్కులర్ వ్యాధులను నివారిస్తందని నిపుణులు అంటున్నారు.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్ లో సాల్ట్ వుంటుంది.ఇవి పొటాటో లో వుంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదే.ఇది శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచడం లో చాలా సహాయ పడుతుంది.అందువల్ల వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదే.

జంక్ ఫుడ్స్ అంటే ఎంత క్రేజ్

ఈ ఆధునిక ప్రపంచం లో కడుపు నింపుకోవడానికి కేరాఫ్ అడ్రస్ జంక్ ఫుడ్స్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేంతగా ఈ లోకంలో ఇవి నడుస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకునే వారు, వేరే పని చేస్తున్న వాళ్ళు, ఈ బిజీ లైఫ్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పేర్లు చెప్పి వాటికీ అలవాటు పడుతున్నారు.ఇదిలా వుంటే ఈ జంక్ ఫుడ్స్ పరిణామాలు చూస్తున్న డాక్టర్లు, పరిశోధకులు మాత్రం ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం అని వల్ల గుద్ది మరి చెబుతున్నారు. ఐతే చాక్లెట్స్ లో కోక, పలు వంటి మంచి పదార్థాలు వుండడం వల్ల ఇవి బోన్, తీత్, హార్ట్ హెల్త్ కి మంచి అలవాట్లు అని చెబుతున్నారు. అదే విధంగా మరి కొన్ని జంక్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు. ఐతే మనకి నిత్యం ఎదురు అయ్యే జంక్ ఫుడ్స్ లో కొన్నిటిని రోజు తక్కువ మోతాదు లో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

జంక్ ఫుడ్స్ వల్ల కలిగే అనర్థాలు

స్థూలకాయం

జంక్ ఫుడ్స్ లో అతిగా వుండే కొవ్వుల వల్ల ఒంటి బరువు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన తిప్పలు మామూలు గా ప్రమాదకరం గా వుంటాయి. శరీరం బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చును. 

రక్త పోటు

జంక్ ఫుడ్స్ లో ఉప్పు తో పాటు జంక్ సోడియం రసాయనాలు అధికం గా వాడతారు.దీనివలన అధికంగా రక్త  పోటు పెరుగుతుంది. రక్త పోటు అనగా బ్లడ్ ప్రెషర్ అంటే బి. పి. రక్త పోటు అధికంగా పెరగడం వలన గుండె సమస్యలు అధికం అవును 

మధు మేహాం 

జంక్ ఫుడ్ లో అధికం గా వాడే చక్కెర పిండి పదార్ధాలు వల్ల టైప్ 2 డయాబెటిస్ వ్యాధి తలెత్తుతుంది.

గుండె జబ్బులూ

జంక్ ఫుడ్స్ లో అతిగా వాడే కొవ్వు పదార్థాలు రుచి కోసం వాడతారు దీని వలన ఇవి రక్త నాళాల పేరుకుపోయి గుండె జబ్బులూ కు దారి తీస్తుంది. 

జంక్ ఫుడ్స్ లో అతిగా వుండే పదార్థాలు

ఉప్పు

మితంగా గా తింటేనే హితం చేసే పదార్థం ఇది.జంక్ ఫుడ్స్ నిల్వ వుండేందుకు ఉప్పును అధిక మొత్తం లో ఉపయోగిస్తారు.

చెక్కెర

రిచికి తిపిగా వుంటుంది ఇది ఎక్కువ తింటే బతుకే చేదుగా వుంటుంది. కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ లో మితిమీరి వాడతారు. ఇది మధుమేహం సమస్యకు దారి తీస్తుంది 

కొవ్వులు 

జంక్ ఫుడ్స్ లో పదార్థాలు ను ఎక్కువగా నూనెలో వేయించి తీయాలి. అందువలన ఇవి తింటే శరీరం లోనికి అనవసర కొవ్వు పదార్థాలు చేరుతాయి. శరీరం బరువు పెరిగే అవకాశం ఎక్కువ మరియు గుండె సమస్యలకు దారి తీస్తుంది. 

పిండి పదార్ధాలు

అనవసర రసాయనాలు జంక్ ఫుడ్స్ లో ముఖ్యమైన ముడి సరుకు ఈ పిండి పదార్ధాలు. రంగు రుచి కోసం అనవసర రసాయనాలు సమృద్ధిగా కలుపుతారు. 

జంక్ ఫుడ్ కి దూరంగా ఉందాం 

కాబట్టి దీన్నిబట్టి మనకి తెలిసింది ఎంటి అంటే ఇంట్లో వన్డే పదార్థాలు తినాలి. బయిట జంక్ ఫుడ్స్ ను తినడం మంచిది కాదు. ఆరోగ్యం మహాభాగ్యం అన్న మాట మర్చిపోకండి. కోరి జబ్బులను మీ జీవితాల్లోకి అలవాటు చేసుకోకాండీ. 

జంక్ అంటే చెత్త జంక్ ఫుడ్స్ అంటే చెత్త తిండి అని అర్థం. ఐతే నాన అనర్థాలు తెచ్చి పెట్టే పడమట దేశాల నుండి అలవాటు చేసుకుని వీటిని జంక్ ఫుడ్స్ అనడం లో తపు వాళ్ళది అని  వాదించే వాళ్ళు కూడా వున్నారు. 

నాలుకకు రుచి తప్ప, తినడంలో పోషక విలువలు అంతగా లేని, ఇవి కాక శరీరంకి  హాని చేసే ఉప్పు చక్కెర వంటి కొవ్వును మితి మిరి వుండి స్థూలంగా వీటిని జంక్ ఫుడ్స్ అని నామకరణం చేసారు.

జంక్ ఫుడ్స్ కి నామకరణం ఎలా చేశారు అంటే పడమటి దేశాల్లో 1960 కాలాల్లో ఇలాంటి తిండిని జంక్ ఫుడ్స్ అనడం మొదలు ఐంది. అప్పటి నుండి ఈ పిజ్జా బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైనవి ఆచరణ లోకి వచ్చాయి. ఫెడ్ చికెన్, ఐస్ క్రీమ్, కేక్,హాట్ డాగ్స్, కార్బోనేట్ కూల్ డ్రింక్స్ మొదలైనవి ఆచరణ పద్ధతులు ఉన్నాయి.

జంక్ ఫుడ్స్ లో తెలియని కొన్ని నిజాలు 

జంక్ ఫుడ్స్ లో మోతాదుకు మించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.నేరుగా మెదడు పై విపరీత ప్రభవాన్ని చూపుతాయి.ఒకసారి తింటే రోజుల తరబడి ఆ ప్రభావం అధికంగా ఉంటాయి. దాని వల్ల ఇంకా తినాలని కోరిక కలుగుతుంది.ఆ కోరికను అదుపు చేసుకోవడం అంత తేలిక కాదు. దానితో అతిగా తినేయడం జరుగుతుంది.

జంక్ ఫుడ్స్ వ్యాపారుల వ్యూహాల పిల్లలను వాటి ఉచ్చులో పడేలా చేస్తున్నాయి. ఈ సంస్థల్లో 80శాతం ప్రకటనలను వారాంతం రోజయిన శనివారం పిల్లల కార్యక్రమాలు వచ్చేటపుడు ప్రసారం చేస్తారు. టివి లో వాటిని చూసిన పిల్లలు మారం చేసి వాటిని తల్లి తండ్రి చేత తెప్పించుకుని తింటారు.

జంక్ ఫుడ్స్ తినే అలవాటు అమెరిక లో 1920నాటికే మొదలు పెట్టారు.ఐతే రెండో ప్రపంచ యుద్దం తర్వాత టీవీ ప్రకటనలు పెరగడం తో అమెరికా లో జనాలకు జంక్ ఫుడ్స్ పై అభిరుచి పెరిగింది. జంక్ ఫుడ్స్ తయారీ లో వాడే ప్రమాదకర రసాయనాలు నాన అనర్థాలను కలిగిస్తాయి. ఉదాహరణకు జంక్ ఫుడ్లో ఎక్కువగా వాడే సోడియం బెంజోయెట్ పిల్లల్లో అతి చురుకుతం, మానసిక సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి జంక్ ఫుడ్స్ ను అతిగా తినడం మంచిది కాదని తెలుసుకుందాం ఆరోగ్యం కాపాడుకుందాం.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్