ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆహారం, ఆరోగ్యం మన శరీరం పై ప్రభావం

ఆహారం, ఆరోగ్యం మన శరీరం పై ప్రభావం 

పండ్లు, కాయగూరలు ఆకుకూరలు గింజలు పప్పులు, కంద మూలాలు, సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి సంపాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లో పండే పండ్లను ఆరగించడం. మనకు తరతరాలుగా తెలుసును.

అన్నం తో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయల ను ఇతర తృణ ధాన్యాలును ఆహారంగా తీసుకోవడం వలన జివించినట్లైతే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు లభిస్తాయి. ఇదే అసలు ఐన ఉత్తమమైన జీవన విధానాలు అని ప్రకృతి వైద్యుల నమ్మకం. 

ఆహారం జీవం వున్న ప్రతి జీవికి అవసరం. అత్యంత అవసరమైనది. పిండి పదార్ధాలు,  మాంసకృత్తులు కొవ్వుపదార్ధాలు ఖనిజలవణాలు పీచుపదార్ధాలు రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. 

ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన ద్రవ రూపాలలో లభ్యం అవుతున్నాయి.

మన జీవన విధానాలులో మార్పులు చేర్పులు చేయడం వలన బ్లడ్ కొలెస్ట్రాల్ లో చెడ్డ  కొలెస్ట్రాల్ ను అదుపు చేయడానికి అవకాశం వుంటుంది. ప్రతి రోజు సాయంత్రం సైక్లింగ్  స్విమ్మింగ్ నడక వంటి తేలికపటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. దీనీ వలన గుండె పదిలం అవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి, అధిక బరువు  మాయమవుతుంది. 

రక్త నాళాల్లో ఆటంకాలను అధిగమించి ముందుకు చేరవచ్చు. కొన్ని పదార్థాలను తినడం వలన రక్త నాళాలు , గుండెకి మంచినీ చేకూరుస్తుంది. ఏ ఏ పదార్థాలు తినడం మంచిదో వాటిలో రోగ నిరోధక శక్తి నీ పెంచే పదార్థాలు ఏంటో అవి తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఆపిల్

రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోపడతాయని లివర్ తయారు  చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

బీన్స్

బీన్స్ లో వుండే కరిగే పీచు పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం కలిగి వుంటుంది. బీన్స్ లో లేతిసిన్ కొలస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం రాగి మాంగనీస్, భాస్వరం, ఫిలిం ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి.

బెర్రీస్

బ్లాక్ బెర్రీ లో వుండే విటమిన్లు గుండెకి, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయని దీనిలో వుండే కరిగే పీచు పెక్టిన్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను బయటకి పంపుతుంది. అనేక రకాల విటమిన్లు మినరల్ కలిగిన పదార్దాలను వంగ అనేక న్యుట్రియంట్లు కలిగి వుంటుంది. ఆక్సీకరణ ప్రక్రియ లో తోడ్పడతాయి. 

ద్రాక్ష

అంతో సైనిన్, టానిన్ వంటి కొలస్ట్రాల్ నిల్వలు నీ బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం శరీరంలో విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. మధు మేహా గ్రస్తులకి ద్రాక్ష నిషిద్దం. 

జామ పండు

తాజా జామ పండు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు. జామ లోని విటమిన్ సి భాస్వరం, నికోటిిక్ ఆమ్లం, కరిగే పీచు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ను పటిష్ట పరిచి , కొలస్ట్రాల్ నిల్వలు తగ్గించి గుండెను సంరంక్షిస్టాయి. 

పుట్టగొడుగు

కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడం లో వీటిలో విటమన్ బి సి, కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉపయోపడతాయని అంటున్నారు. 

గింజలు

బాదం పప్పులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుట. ఒలియిక్ ఆమ్లం దీని లోని చెడు కొలెస్ట్రాల్ గుండెను వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. జీడి పప్పు లోని మోనో, అన్ సచిరేటెడ్ కొవ్వును తగ్గించి గుండెను కొవ్వును కరిగిస్తుంది. గుండెను పదిలంగా వుంచుతాయి.

వెల్లుల్లి

రక్త పోటును, గుండె లో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గింన్చడంలో సహాయ పడుతుంది. 

ఓట్ మీల్

దీనిలో బీటా గ్లూకజ్ అనే ప్రత్యేక కరిగే పీచు పదార్థాలు స్పాంజి వలే పని చేసి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

సబ్జా గింజలు

దీని పొట్టు పేగులలోనికి చెడు కొలెస్ట్రాల్ ను ప్రవహించనియదు. చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించే అత్యంత శక్తి వంతమైన పదార్థం గా ప్రసిద్ది కెక్కింది.

పొట్టు తీయని గింజలు

గోధుమ, మొక్క జొన్న, ఓటు ధాన్యం, బార్లీ వీటిలోని 3 పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్త పోటు, రక్తం గడ్డ కట్టడానికి తగ్గిస్తుంది. 

జీవితం లో ఆహారం ప్రాముఖ్యత ఏంటి?

మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంల పని చేస్తుంది. ఐతే ఆధునిక జీవన శైలి కారణంగా మనం ఏ ఆహారం తీసుకుంటున్నా నియంత్రణ లేకుండా పోయింది.

ఆరోగ్యం విషయంలో ఆహారం పోషించే పాత్ర

మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్ర ఎలా పని చేయదు అలా మన శరీరం కూడా ఆహారం లేకుండా పని చేయదు. మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనం లా పని చేస్తుంది. ఐతే ఆధునిక కాలంలో మనం ఏ ఆహారం తింటున్నమో కూడా నియంత్రణ లేకుండా పోయింది. ఆహారం, శరీర తత్వం, ఆహారం మనం మీద చాలా ప్రభావం అధికంగా వుంటుంది. 

ఇది మన శరీరం పై 3 విధాలుగా ఉపయోగడుతుంది

ఆహారం మన శరీర నిర్మాణంకి దోహద పడుతుంది. 2.7 కిలోల నుండి 3.2 కిలోల మద్య వుండే బరువు వుండి కొత్తగా పుట్టిన పాపాయి, పెరిగి పెద్ద అయ్యేసరికి 55 నుండి 75 కిలోల బరువుకు చేరుకుంటాడు. ఎదిగిన బరువంతా తను పుట్టిన నుండి తీసుకున్న ఆహారం ద్వారానే లభిస్తుంది. 

ఆహారం ముఖ్య పని ఏంటి అంటే శరీర నిర్మాణానికి సహకరించటం. పుట్టిన రోజు నుండి పెరుగుతున్న కొద్ది మీరు ప్రతి రోజూ ఆహారాన్ని తీసుకోవడం సరైన క్రమంలో తీసుకోవడం ద్వారా అది మి శరీరంలో అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాన్ని నిర్మించి శరీరానికీ కావలసిన మి శరీరం సక్రమమైన రీతిలో ముందుకు వెళుతూ ఆరోగ్యమైన రీతిలో ఎదుగుతూ ఆరోగ్యంతో విలసిల్లుతూ పరిపూర్ణ స్థాయికి చేరుకుంటోంది.

శక్తి కోసం 

ఆహారం మన శరీరానికి చేకూర్చే రెండో ప్రయోజనం మన శరీరం కోసం సంకల్ప, అసంకల్పిత చర్యలకు కావలసిన శక్తిని అందిస్తూ వుంటుంది. 
శరీర క్రమబద్దకరణకు ఉపయోపడతాయని
మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే జరగాల్సిన కార్యక్రమాలు క్రమబద్దీకరణ ఈ కోవలోకి వచ్చే చర్యలు
  • గుండె కొట్టకోవటం
  • కండరాల సంకోచ వ్యాకోచాలు
  • నీటి సమతుల్యను కాపాడటం
  • రక్తం గడ్డ కట్టడం, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం మొదలైనవి. 
శరీరం సక్రమంగా ఆరోగ్యం గా వుండాలి అన్న శరీరానికి కావలసిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. సమతుల్యత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మన మనుగడకు అవసరమైన ఆహారం తీసుకున్న తర్వాత మనకు లభించే పోషక పదార్థాలు 
  • కార్బహైడ్రేట్స్
  • మాంసకృత్తులు
  • విటమిన్ల కొవ్వు పదార్థాలు,
  • ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థం 
సమతుల ఆహారం - ఆహారం ప్రాముఖ్యత 


శరీర ఆరోగ్యాన్ని అవసరమైన ఇలాంటి అందలన్నితిని పరిగణలోనిక తీసుకుంటూ,  ప్రాధాన్యత ఇస్తూ మనం సక్రమమైన ఆరోగ్యంలో వుండడానికి ఏ ఏ  ఆహార పదార్థాలను ఏంత మేరా  తీసుకోవాలి అన్న విషయము పై అమెరికా శాస్త్రవేత్తలు ఫుడ్ గైడ్ పిరమిడ్ అనే పేరుతో ఆహార నియమావళిని రూపొందించారు.

పళ్ళు

పళ్ళు వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా వుంటాయి. వీటిలో విటమిన్ సి, ఎ లాంటివి అధిక మొత్తం లో వుంటాయి. వీటిలో ఎక్కువగా విటమిన్ల, పొటాషియం ఇంకా ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఇవే కాక దీనిలో ఫైబర్ గుణాలు అధికంగా వుంటుంది. వీలైనప్పుడు అల్లా తాజా పళ్ళను తినడం శరీరానికి చాలా మంచిది. 

కాయగూరలు 

వీటిలో కూడా కొవ్వు పదార్థాలు చాలా తక్కువ వుంటాయి. ఎ, సి విటమిన్ ఎక్కువ వుంటాయి. ఖనిజ లవణాలు కూడా అధింగానే వుంటాయి. మాంసం, గుడ్లు, చేపలు, చికెన్, జీడిపప్పు, వగైరాలు. వీటిలో సాధారణంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటుంది. కంట్టి కొంచం జాగ్రత్తలు తీసుకోవాలి. 

స్వీట్స్, నూనెలు

ఇటువంటి ఆహార పదార్థాలలో పోషక విలువలు అంతగా ఉండవు, కాని కేలరీలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. కేకులు, స్వీట్స్ లాంటివి అంత తక్కువగా తింటే అంత మంచిది. ఆహారాన్ని అస్సలు తీసుకోక పోతే కొందరు నిరాహార దీక్ష వల్ల, జీర్ణకోశ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న సమయం లో, పక్షవాతం వల్ల, కోమాలోకి వెళ్లి పోయినప్పుడు, మొదలైన సందర్భాల్లో మనుషులు నిరహరనికి గురి కావల్సి వుంటుంది. 

మార్పులు

కండరాలు జరిగిపోయే ఎముకలు పొడుచుకు వస్తాయి. చర్మం పల్చగా అయ్యి పొడిబారిన చర్మంగా మారుతుంది. చర్మంలో సాగే గుణం తగ్గిపోతుంది. తెల్లగా పాలిపోయింది చల్లగా అవుతుంది. వెంట్రుకలు పొడిబారి చిట్లుతాయి. తేలికగా మారుతాయి, పూర్తిగా నిరాహారగా వుంటే 8 నుండి 12 వారాల లోపు చనిపోతారు 

చికిత్స

ఎక్కువ రోజులు పాటు నిరాహారగా వుంటే మామూలు స్థితికి రావడానికి కొంత వ్యవధి పడుతుంది. దని ప్రభావం శరీరం మీద అంత ప్రభావం పడుతుంది. అధిక రోజులు ఆహారం తినకుండా వుండడం వల్ల జీర్ణ యంత్రంగా ముడుచుకు పోతుంది. మామూలు సమయంలో తీసుకున్న ఆహారాన్ని ఇది ఏమిడ్చుకొలేదు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్