ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎన్నో రకాల పూవుల మొక్కలు, వాటి ఉపయోగాలు

పువ్వులు

ఒక పుష్పం దీన్ని కొన్ని సార్లు పూత అని కూడా అంటారు. వికసించడం అని అంటారు. ఇది పుష్పించే మొక్కలు ద్వారా లభ్యమైన పునరుత్పత్తి భాగంకి చెందుతుంది. ప్రక్రియ పరాగ సంపర్కముతో మొదలై ఫలదీకరణం చెంది వుంటుంది. పువ్వులు నిజంగానే మృదువుగా వుంటాయి. అందమైన రంగులనీ కలిగి వుంటుంది. వేలాది రంగులు మరియు మిశ్రమ రంగులతో కనిపిస్తాయి. పువ్వుల కోసం పుల తోటలను పెంచుతారు. పుష్పాలు చాలా ఉపయోగకరం. తేనెటీగలు పువ్వులు నుండి తేనెని సేకరించి వాటి ద్రవాకాలాల్లో నిల్వ చేస్తాయి. ఎక్కువగా వేసిన పుల తోటలను ముగ్ధ మనోహర దృశ్యంగా వుంటుంది. మంచి సువాసనతో, తీపి వాసనతో ఆకర్షణయమయిన మైమరిపిస్తంది. అందుకే చాలా మంది కవులు పుల గురించి వ్రాసి మన సాహిత్యాన్ని వృద్ది చేశారు.
ఇప్పుడు కొన్ని పుల మొక్కలు గురించి తెలుసుకుందాం
గులాబీ పువ్వులు మరియు ఉపయోగాలు
ఈ పువ్వును ప్రేమాభిమానాలకు చిహ్నంగా చెబుతారు. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతాయి. ప్రతి రంగుకు ఒక విశిష్టత ఉన్నప్పటికీ, మీ మూడ్ బాగుచేయడానికి ఇవన్నీ సమాన సహకారాన్ని అందిస్తాయి. గులాబీని చూడటం, దాని వాసన పీల్చడం వలన, మనలో మన గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మంచి భావనలు కలుగుతాయి. గులాబి పువ్వులు చాలా అందంగా వుంటాయి. గులాబి పువ్వులు నీ అన్ని పువ్వులకు రాణి అని అంటారు. గులాబి మొక్కలకి చుట్టూ ముల్లులు వుంటాయి. గులాబి పువ్వులు మెత్తటి మృదువైన, స్వచ్ఛమైన రంగులతో వంపుతో వుండే పురేకులని కలిగి ఉంటాయి. మంచి సువాసన కలిగి వుంటాయి ఇందులో పసుపు, తెలుపు, ఎరుపు, లైట్ పింక్, గులాబి, నారింజ, పిచ్, కోరల్, లావెండర్ రంగులని కలిగి వుంటాయి. ఈ పువ్వలని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అన్నిటికంటే ఈ పువ్వును అందరకి ఇష్టం.


 • పూజలు చేయడం కి ఉపయోగ పడుతుంది. 
 • స్త్రీలు తమ జాడల్లో అలంకరించుకుంటారు. 
 • మందులు, పెర్ఫ్యూమ్, దండలు, వంటలులలో వాడతారు. 
 • బ్యూటీ టిప్స్ లో వాడతారు. ఆయురవేదానికి చాలా మంచిది. 
 • అందరికీ అందుబాటులో వుండే పువ్వు, అందరికీ ఇష్టమైన పువ్వు.

మందారం పువ్వులు మరియు ఉపయోగాలు 

మందారం ఒక అందమైన పువ్వు. ఇవి పువ్వు పెద్దవిగా ఆకర్షణీయంగా వుంటాయి ఇవి పెద్ద పెద్ద రెక్కలతో వుంటాయి. సువాసన లేకుండా పెద్ద పువ్వులతో వుంటాయి. ఇవి రక రకాలుగా రంగులతో కలిగి వుంటాయి. ఇవి ఎరుపు, తెలుపు, పసుపు, కాషాయ రంగు కలిగి వుంటాయి. వివిధ రంగుల్లో వుంటాయి దీన్ని జాతీయ పువ్వు గా ప్రకటించింది మలేషియా ప్రభుత్వం. దీనిని సమశీతోష్ణ ప్రాంతాల్లో అలంకరణ కోసం వాడతారు. వీటికి మద్యలో పుప్పొడిని కలిగి ఉంటాయి.
 • శిరోజాలు సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు. 
 • స్త్రీలకి పువ్వు ఒక శుభ సూచకం. 
 • మందార పువ్వులుతో తయారు చేసిన టి రోజు తాగడం వల్ల హై బీపి తక్కువగా ఉంటాయి. 
 • దీనిని ఔషధ గుణాలు ఉన్నాయి. 
 • దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. 
మల్లి పువ్వులు మరియు ఉపయోగాలు

మల్లె పువ్వులు తెల్ల రంగులు వుంటాయి. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి చాలా మంచి సువాసన కలిగి ఉంటాయి. చూడటానికి ఆకరషణీయంగా, అందంగా వుంటుంది. మన సౌందర్యం పెంచుకోవచ్చు. అలంకరణ కోసం పెళ్ళిలో వాడతారు. వేసవి రాగానే మల్లి మొగ్గలు వాసన గుప్పు మంటుంది. జాజి, విరజాజి ఈ కుటుంబానికి చెందినది.ఇవి స్త్రీ లకి అతి ప్రధనమైనది. చాలా ఎక్కువగా ఇష్టపడుతూవుంటారు. పువ్వులలో అన్నిటికంటే ముఖ్యమైనది.

 • ఫేస్ ప్యాక్, చుండ్రు తగ్గడానికి వాడతారు. 
 • ఆడవారు జడలో పెట్టుకోడానికి ఇష్టపడతారు. 
 • ఔషధలలో వాడతారు. 
 •  నూనెని తయారు చేస్తారు.ఈ నూనెని వెంట్రుకలు నల్లగా, ఏపిక గా పెరగటానికి ఉపయోగపడుతుంది. 
 • స్త్రీలు దండలుగా అల్లుకుని జడలో పెట్టుకుంటారు. 
కలువ పువ్వులు మరియు ఉపయోగాలు
ఇవి మృదువైన రేఖలు కలిగి ఉంటాయి. ఇవి చెరువు కాలువల్లో కనిపిస్తాయి. ఇది మన రాష్ట్ర పుష్పం. పొడవాటి కాడలతో తెలుపు, గులాబి, నీలం రంగుల్లో అందంగా వుంటాయి. దీనిని వాటర్ లిల్లీ అని కూడా పిలుస్తారు. ఇవి అతి ఎక్కువగా రేకులను కలిగి వుంటుంది.

 • హృదయ రోగాలు మరియు నీరసం నీ తగ్గిస్తాయి. 
 • అజీర్ణం తగ్గడానికి పనిచేయును. 
 • వీటిని లక్ష్మి దేవి అలంకరణలో, అనేక దేవతలకు అలంకారంగా వాడతారు. 
 • ఇది ఒక దైవ పుష్పంగా వాడతారు. 
 • ఇవి దొరకడం చాలా కష్టం. నీటి కొలనులు, చెరువుల్లో చాలా అరుదుగా లభిస్తాయి. 
తామర పువ్వులు మరియు ఉపయోగాలు
ఇది చాలా అందమైనది. వీటి ఆకులు గుండ్రంగా చిన్న చిన్న ముల్లు కడలతో కలిగి వుంటాయి. ఇవి ఎక్కువగా మంచి నీటి చెరువుల్లో కనిపిస్తాయి. ఇవి కలువ పువ్వు లాగ దొరకడం చాలా అరుదు.ఇవి తెలుపు, లేత గులాబి రంగులతో వుంటాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు మన భారత దేశ జాతీయ పుష్పం. ఇది వాసనను కలిగి వుండును.

 • ఈ పువ్వు సువాసన కలిగి వుండడం వలన దీనిని పూజల్లో వాడతారు. 
 • గుండె జబ్బులూ, వ్యాధులను, కమెర్లను తగ్గిస్తాయి. 
 • మూల వ్యాధుల, కుష్టు వ్యాధి తగ్గించడంలో సహాయ పడుతుంది. 
 • దీనిని ఆయుర్వేద వైద్య విధానాలలో ఉపయోగిస్తారు. 
ప్రొద్దు తిరుగుడు లేక సూర్యకాంతి పువ్వులు మరియు ఉపయోగాలు
ఈ పువ్వులను కళ్లారా చూసినా, దీని సువాసన పీల్చినా, మీ మూడ్ ఉత్సాహంగా మారుతుంది.
ఇంకా చెప్పాలంటే, ఈ పువ్వులోని ప్రకృతి సహజ సుగుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫినైల్ ఎలనిన్, మీ హార్మోన్లపై ప్రభావం చూపించి మిమ్మల్ని ఆనందపరుస్తుంది.

చేలో మనను చూసి తలలాడిస్తూ, పలుకరిస్తున్నట్లుగా వరసలలో ఉండే ఈ పూలను చూడగానే మన మనసు అనుకూల భావనాలతో నిండిపోతుంది. మనలో ఉత్సాహం వెల్లువెత్తుతుంది.
దీనినే సూర్యకాంతం పువ్వు అని కూడా అంటారు. ప్రొద్దు తిరుగుడు పువ్వులో అనేక రకాల లాభాలు వున్నాయి,  ఇది సూర్యుడు వైపు తిరిగి వుంటుంది అని పురాణ గాధ లో చెప్తారు. ఇది వంటి జాతి యొక్క మొక్క .ఇది పసుపు రంగులో వుంటుంది .ఇది చాలా పెద్ద పువ్వు. ఇది 3 నుండి 4, 5 రేకులను కలిగి వుంటుంది, ఇది సువాసన కలిగి వుండదు. ఇది ఒక కొమ్మకి ఎక్కువ పులను కలిగి వుంటాయి. ఈ పువ్వు పేరు మెడ ఒక రాజు పేరు సన్ కింగ్ అని పేరువుంది.
 • ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు గింజల నుండి నూనెను తీసి వాడతారు. 
 • ప్రోటీన్లు, కాల్షియం దీని నుండి లభిస్తాయి. 
 • ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు పిండిని పశువులకు బలమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. 
 • ఔషద తయారీలో, రంగులు వేయడానికి ఈ పువ్వు ఉపయోగపడుతుంది. 
 • పువ్వులో వున్న పప్పును పెంపుడు పక్షులకు ఆహారంగా ఉపయోగిస్తారు. 
లిల్లీ పువ్వులు మరియు ఉపయోగాలు
లిల్లీ ఇది అందమైన పువ్వు మొక్క. ఇది భూమిలో దుంప కలిగిన జాతి మొక్క. ఇవి తెల్లగా పొడవైన కాడతో కలిగి వుంటుంది. మంచి సువాసనతో కలిగి వుంటుంది. ఇవి ఉద్యాన వనాలు లో అందంగా కనులకు విందు చేస్తాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతి సాహిత్యాలలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంటాయి. వీటిలో సుమారు 110 జాతులు కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా ఇళ్లలో పెంచుతారు. ఆడవారు జడలో పెట్టుకుంటారు. దేవతల పటాలకి పెడతారు. ఎక్కువగా మన ఆంధ్రాలో వీటికి ప్రాధాన్యత ఇస్తారు. 

 • గనేరియా వ్యాధి నివారణకు, మొటిమల నివారణకు, ఉపయోగ పడుతుంది. 
 • దీని ద్వారా నూనెని తయారు చేస్తారు, పుప్పొడిని తీస్తారు. 
చామంతి పువ్వులు మరియు ఉపయోగాలు
ఈ పువు చూపుకు అందంగా ఉండటమే కాక, మన నరాలను శాంతపరుస్తుంది. మనలో చాలమంది చక్కనైన రుచి మరియు సువాసన కలిగిన కేమోమైల్ టీని గురించి తెలిసినవారే! ఈ టీని సేవించినంతనే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఈ పూల నుండి వెలికితీసిన సారంతో, నిద్రకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా పెద్దవారిలో పరిష్కారమవుతాయి. మీ మూడ్ ని తేలికపరచి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచే శక్తి వీటికి ఉంది
చామంతి ఒక అందమైన పువ్వు. ఇది శీతాకాలంలో పూస్తుంది. ఇవి పసుపు, తెలుపు, ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మొత్తం సుమారు 30 జాతుల మొక్కలు వుంటాయి. ఇవి ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందినవి. చేమంతి శీతాకాలంలో పూస్తుంది. సాగులో ఉన్న చేమంతి పూలు రకాలు, నక్షత్ర చామంతి, పట్నం చేమంతి మొదలైన రకాలు కలవు. ఇవి చిన్న చిన్న రెక్కలతో ఒక మాదిరి ఆకారంలో వుంటాయి. వీటి వాసన గుప్పు మంటుంది. ఈ పూలను ఆడవారు జడ లో పెట్టుకుంటారు. దేవుడి ఫోటో లకు పెడతారు. 

పసుపు పుల రకాలు 
 •  ఎల్లో గోల్డ్, 
 • రాయ్ చుర్, 
 • సిల్పెర్ వీటిని హైదరాబాద్ ప్రాంతాల్లో సాగు చేసే రకాలు.
తెలుపు పుల రకాలు
 • రత్లం సెలెక్షన్, 
 • బగ్లి
ఎరుపు పుల రకాలు
 • రెడ్ గోల్డ్, 
 • కో 2
సాగు చేసే విధానం
చామంతి మొక్కలు పగటి పూట మాత్రమే పెరుగుతాయి. పగటి పూట సమయం తక్కువగా వుండడం వల్ల రాత్రి పూట సమయం ఎక్కువగా వుంటే మొక్కల్లో ఎదుగుదల ఎక్కువగా వుంటుంది. అందుకోసం ఈ పువ్వులను జూన్, జూలై నెలలో వేస్తే నవంబర్, డిసెంరులో పూస్తాయి.

బంతి పూల మొక్క
ఆఫ్రికాలో ఈ మొక్కను కాకి బుష్ అని అంటారు. ఈ మొక్క ఫ్రాన్స్, ఉత్తర అమెరికాలో కూడా పెంచబడుతున్నది. మొక్క ఆకులు చీలి ఉండి తేలికగా వుండి ముదురు ఆకుపచ్చ రంగులో వుండును పువ్వులు పలు రెక్కలతో పసుపు రంగులో వుంటుంది. గుత్తిగా కలిగి వుండును. కొన్ని ప్రాంతాలలో మొక్కలను కడతారు. ఆస్ట్రేలియాలో ఈ మొక్కని ఎక్కువగా పెంచుతున్నారు. అక్కడ ఈ మొక్క బాగా వ్యాప్తి చెందుతుంది.

బంతి పూల నూనె
బంతి పూల నూనె ఒక అవస్యక నూనె. బంతి పూల నూనె ఒక సుగంధ తైలం.దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి.బంతి లో ముద్ద బంతి, రేకు బంతి.దాదాపు 50 వివిధ రకాల బంతి పూవులు వుంటాయి. బంతి పుల అనేక రకాల ఆకారాల్లో వుంటాయి.ఈ నూనె నీ చాలా తక్కువగా సుగంధ తైలం గా వాడతారు. ఎక్కువ మంది ఈ నూనె నీ ఔషధం గా ముఖ్యం గా ఆయుర్వేదం లో ఉపయోగిస్తారు.ప్రధానం గా ఛాతి నొప్పులకు వాడతారు.


నూనె సంగ్రహణ
మొక్క పువ్వు ల నుండి కాకుండా, ఆకులు, రెమ్మలు పూల కాడలు నుండి కూడా నూనెని వాడతారు.
నూనె ఉపయోగాలు
ఆయుర్వదానికి ఉపయోగించి వాడతారు.లావెండర్, జాస్మిన్, లెమన్ వంటి నూనెల మిశ్రమంతో కలిపి సుగంధ తైలం గా వాడతారు.మానసిక ఆందోళనకు తగ్గిస్తుంది.మర్ధన నూనెల్లో, బాత్ అయిల్ లో ఉపయోగిస్తారు.


తులిప్ మొక్క
అందమైన పువ్వులతో అలరించే తులిప్ మొక్క .ఇందులో మొత్తం 109 రకాలు ఉన్నాయి.వీటి మూలాలు దక్షిణ ఐరోపా , ఉత్తర ఆఫ్రికా , ఆసియా , ఇరాన్ చైనా లలో వున్నాయి.వీటిని నీ పుల కుండల్లో ఉపయోగిస్తారు. ఇవి పెద్ద రెక్కలతో చాలా మంచి సువాసనతో కలిగి వుంటాయి .అలంకరణ కోసం వీటిని ఎక్కువగా వాడతారు. పెళ్లి లో వీటిని ఎక్కువగా వాడతారు.ఈ జాతి మొక్కల మూలం దుంప.ఇవి నిత్యం దుంప తోనే వుంటాయి .మొక్క మూలల్లో చిన్న దుంపల్లో వుంటాయి.చివర్లో ఈ దుంపలు పుట్టుకుని వస్తాయి .వీటిలో కొన్ని జాతులు పొట్టిగా వున్నాయి.మరి కొన్ని జాతులు పొడవుగా ఉంటుంది.ఇవి 10 నుండి 70 సెంటీమీర్లలో పెరుగుతాయి . ఈ కాండనికి ఒక పువ్వు వేస్తోంది.


లాభాలు..
పువ్వులు..అందం గా వుంటాయి. ఆకర్షణీయంగా వుంటాయి. ఆడవారు జడల లో ఇష్టపడతారు.వీటిని తలకి వెంట్రుకల కుదుళ్లు గట్టిగా అవడనికి ఏపికగ పెరగడానికి దోహదం చేస్తాయి. పువ్వులు..నూనెని తీసి..ఆరోగ్యాన్ని కాపాడతాయి .చాలా రకాలుగా ఈ పువ్వులను ఉపయోగించుకోవచ్చు. పువ్వులు మానవాళికి చాలా రకాలుగా ఉపయోగడుతుంది అని చెప్పుకోవచ్చ.
డిసెంబర్ పూవు
డిసెంబరం () అనేది అకంథేసి కుంటుంబానికి చెందిన మొక్క. వీటిని గొబ్బిపూలు, పెద్ద గోరింట అని కూడా అంటారు. ఫిలిప్ఫైన్స్‌ వయొలెట్‌, బ్లూబెల్‌ బర్లేరియా అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా.యారో


ఈ పూలు కొండప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి తెలుపు రంగులో ఉంటూ, సమయం గడుస్తున్నకొద్దీ పూల అంచులు గులాబీ రంగులోకి మారతాయి. ఈ పూల సౌందర్యానికి ముగ్ధులైన శాస్త్రవేత్తలు, ఇవి మూడును తెలికపరచేందుకు ఉపయోగపడతాయని తేల్చారు. ఈరోజుల్లో వీటిని ఆందోళనకు చికిత్సలో భాగంగా ఉపశమనకారిగా వాడుతున్నారు. రక్తపోటుతో కూడిన ఆందోళన ఉన్నవారిలో, ఇది అద్భుతంగా పనిచేస్తుంది
శీతాకాలంలో పెరిగే అద్భుతమైన పూల మొక్కలు


శీతాకాలం సూర్యుడు తక్కువ సమయం ఉంటూ, ఎండ కూడా స్వల్పంగా ఉంటుంది. క్రమంగా చల్లని ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటూ, క్లిష్టమైన వాతావరణం నెలకొంటుంది. దీని మూలంగా జీవన విధానాలలో కూడా స్తబ్ధత మొదలవుతుంది. అంతేకాకుండా, శీతాకాలంలో అనేకరకాల పుష్ప జాతుల మొక్కలు ఆకులను వదిలివేసి, నిద్రావస్థకు చేరుకుంటూ ఉంటాయి. క్రమంగా వాటికి పూలు పూయడం కూడా కష్టతరంగా ఉంటుంది. కానీ, ఈ సంవత్సరంలో ఇటువంటి చల్లటి నెలల్లో కూడా వృద్ధి చెందుతున్న కొన్ని పుష్ప జాతులు ఉన్నాయి.


కాలెంన్డ్యులా

కాలెంన్డ్యులా, సాధారణంగా దీనిని "పాట్ మారీ గోల్డ్" అని వ్యవహరించడం జరుగుతుంది. . కుండలు మరియు ప్లాంటర్స్ లో బాగా పెరుగుతాయి. ఇవి అత్యంత సాధారణమైన శీతాకాలపు పువ్వులుగా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా నిర్వహించడం కూడా సులభం. పసుపు నుండి లోతైన నారింజ వరకు వివిధ రంగులలో ఈ పూలు పూస్తుంటాయి.

జాస్మిన్


ఈ శీతాకాలంలో మీ తోటకి అందాన్నివ్వడానికి "వింటర్ జాస్మిన్" రకం మొక్క ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పబడుతుంది. వీటి నిర్వహణా వ్యయం, మరియు శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన పసుపు రంగు పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. మరియు అవి జనవరి ప్రారంభంలోనే వికసిస్తుంటాయి.
పాన్సీ..


మరో సాధారణ శీతాకాలపు పువ్వుగా పాన్సీ ఉంటుంది. ఇది దాదాపు అన్ని రంగుల షేడ్స్ లో లభిస్తుంది. విభిన్న రంగుల కలయికను ఉపయోగించి మీరు మీ తోటలో వాటిని పెంచుకోవచ్చు. పాన్సీలు తక్కువగా పెరిగే మొక్కలు కావున ఇవి నీడలో బాగా వృద్ధి చెందుతాయి...

పెతునియస్


మీ శీతాకాలపు తోటను ప్రకాశవంతం చేయడానికి పెటునియాస్ కూడా మంచి ఎంపికగా సూచించబడుతుంది. ఈ శీతాకాలంలో 'గ్రాండి ఫ్లోరా' రకం పెటునియాని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అవి పెద్ద పరిమాణంలో పువ్వులను కలిగి ఉంటాయి. శరదృతువు మరియు శీతాకాలంలో నాటడానికి అనువైన మొక్కలుగా సూచించబడుతాయి. పెటునియాస్ తెలుపు, పసుపు, గులాబీ, ముదురు క్రిమ్సన్ మరియు నలుపు, ఊదా వంటి అనేక షేడ్స్‌లో వస్తాయి.

ఇంగ్లీష్ ప్రింరోస్

ఈ పువ్వులు, శీతాకాలంలో మీ తోటను అందంగా ఉంచేందుకు సూచించదగిన మరొక ఉత్తమ ఎంపికగా ఉంటుంది. అవి తెలుపు, పసుపు, నారింజ నుండి నీలం, గులాబీ మరియు ఊదా రంగు వరకు దాదాపు అన్నిరకాల రంగులో పూస్తుంటాయి. ఇంగ్లీష్ ప్రింరోస్ శీతాకాలం మధ్యకాలం నుండి వికసిస్తుంది.

హెలెబోర్


ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దీనిలో వేర్లు లోతుగా పెరుగుతూ రూట్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. హెలెబోర్స్ చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. సాధారణంగా ఇవి తెలుపు, గులాబీ మరియు ఊదా వంటి రంగులలో కనిపిస్తాయి. ఈ పువ్వులు పెరుగుతున్నప్పుడు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి, అందుకే వాటిని ఎత్తుగా ఉన్న కుండీలలో పెంచవలసి ఉంటుంది

కామెల్లియాస్


శీతాకాలంలో కామెల్లియాస్ ఆశ్చర్యకరంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల పుష్ప జాతిగా ఉంటుంది. అవి చల్లని గాలులు వీచినంత కాలం ఈ పుష్పాలు వికసిస్తుంటాయి. ఈ మొక్కలు మీ తోటలోని ఇతర మొక్కలతో సరిపోయేలా కూడా ఉంటాయి.

వింటర్ హనీసకిల్


వింటర్ హనీసకిల్ పువ్వులు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వికసిస్తాయి. ఈ మొక్క క్రీమీ వైట్ పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిమ్మకాయను పోలి ఉండే సువాసనను విడుదల చేస్తుంది, ఇది మీ నిస్తేజమైన శీతాకాలపు వాతావరణాన్ని ఆసక్తికరంగా చేస్తుంది.

స్వీట్ అలిసమ్


ఈ పువ్వులు తేలికపాటి మంచును తట్టుకోగలవు. అవి దృడంగా ఉన్నందున, వాటిని శీతాకాలం అంతా ఎటువంటి సంకోచం లేకుండా పెంచవచ్చు. ఇవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా కూడా, సూక్ష్మమైన తీపి సువాసనను కలిగి ఉంటాయి.

స్నోడ్రోప్స్


అందమైన, క్రిందికి తిరిగిన తెల్లటి రేకులతో విరబూసే ఈ స్నోడ్రోప్స్ మీ శీతాకాలపు తోటకు సూచించదగిన సరైన పుష్ప జాతి మొక్కలుగా ఉంటాయి. ఈ పువ్వులు నవంబర్ ప్రారంభంలో వికసిస్తూ, అవి ఫిబ్రవరి వరకు పెరుగుతాయి

.శీతాకాలంలో పువ్వులను పెంచడానికి సూచించదగిన చిట్కాలు..


1. మీ తోటలోని స్థలం ప్రకారమే మొక్కలను నాటండి.

2. శీతాకాలంలో మీ మొక్కలకు జాగ్రత్తగా నీరు పోయాలని గుర్తుంచుకోండి.

3. క్రమం తప్పకుండా కంపోస్ట్ అనుసరించండి.

4. కంటైనర్లలో మొక్కలను పెంచుతున్నట్లయితే, కంటైనర్‌లో తగినంత పారుదల ఉండాలని గుర్తుంచుకోండి.

పువ్వులు అనేవి మనం చాలా రకాలుగా ఉపయోగిస్తాము. కాబట్టి వాటి అవసరం అనేది మనకు చాలా వుంది. మనసుకి ఆహ్లాదకరం గా, ఉల్లాసంగా వుంటాయి. ప్రశాంతతను , అందాన్ని కలిగిస్తాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్