ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వ్యవసాయం, పంటలు, రైతులు మరియు పని ముట్టులు


వ్యవసాయం, పంటలు, రైతులు మరియు పని ముట్టులు  

రైతులు పంటలు పండించడం వల్ల మన అందరికీ ఆహారం లభిస్తుంది. ఆహారం కోసం రైతులు పైనే గ్రామాలు పట్టణాల్లో వాళ్ళు అందరూ ఆధారపడి వున్నారు. గ్రామాల్లో రైతులు పంటలు పండించి పట్టణాలకు పంపించడం వక్క పట్టణాల్లో వల్లి తమకు అవసరమైన ఆహార పదార్థాల పొందుతున్నారు. గ్రామాల్లో వాళ్ళు తమ పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయుకుంటే పట్టణాల్లో వాళ్లకు తినడానికి ఆహారం లభించదు. మనం తినే ఆహారం వెనుక ఎంతో మంది కృషి వుంది. వరి కృషిని తెలుసుకోవడానికి దగ్గరలోని వ్యవసాయం చేసే వారికి లేదా రైతుల కు చాలా మనం రుణపడి వుంటాం. 
crop field where farmers do agriculture
crop field 
గతంలో నాగలితో పొలం దున్నేవారు. ఇప్పుడు ట్రాక్టర్ తో దున్నుతున్నారు. వరినాటు యంత్రం, కలుపు తీసే యంత్రం, పంట నూర్పిడి యంత్రం, వంటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా పనుకు తొందరగా పూర్తి అవుతాయి. కూలీల అవసరం కూడా తగ్గుతుంది.

మార్కెట్లో అమ్మే కొన్ని కంపెనీల నాసిరకం విత్తనాల అమ్మి మిడం చేస్తున్నాయి. అవి నాటితే విత్తనాలు మొలకలు రావు. మొలకెత్తిన పంటపెరుగుతుంది. కానీ గింజలు రావు. నకిలీ విత్తనాలు వలన పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. 

మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరుకు దాదాపు 5,400 రకాల వారి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 వంకాయ రకాలు వుండేవి. సంప్రదాయ పంటల విత్తనాల భద్రపరచడం వలన అశ్రద్ద వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వలన అనేక రకాలు కనుమరుగు అయ్యాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువును సేకరించి భద్రపరుస్తారు. వ్యవసాయం కోసం కంపోస్టు ఎరువు, వానపాముల సాయంతో వర్మి కంపోస్టు ఎరువు తయారు చేసి, వాడుతున్నారు. అలాగే చీడపురుగుల నివారణ కోసం, వేప నూనె, పంచ గవ్య మొదలగు సేంద్రీయ ఎరువులతో పురుగుల మందు వాడి అధిక దిగుబడి రాబట్టుకున్నారు. 

పంచగవ్య అనేది ద్రవ రూపం లో వుంటుంది, జీవామృతం కూడా ఎరువుగా ఉపయోగపడి నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులు వృద్ది చేసేదిగా ఉపయోగపడుతుంది.

వ్యవసాయం -వాతావరణ పరిస్థితులు 

నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను జంతువులను పెంచి పోషించి తద్వారా ఆహారాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు.

వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అభివృద్ధిలో వ్యవసాయం ఒక కీలక అంశం. వేటాడడం ద్వారా వ్యవసాయం సముపార్జన చేసుకునే స్థితిలో ఉన్న సంస్కృతిలో కనిపించిన సంపుతా సమకూర్చుకోవడం, సైనిక కలాపాల వంటి ప్రత్యేకతలు వ్యవసాయ అభివృద్ధి చెందడం తోనే ప్రారంభమయ్యాయి. సమాజంలో కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండించడంతో తెగ లేదా రాజ్యం లోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలకు పోషించే వెసులుబాటు ఇచ్చింది. ప్రపంచంలో శ్రామికుల 42 శాతం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అందుచేత వ్యవసాయం ప్రపంచంలో అధిక శాతం ప్రజలు యొక్క వృత్తి. వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచంలో కేవలం 5 శాతం మాత్రమే.

రైతు - వ్యవసాయం

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులని అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారు.

వ్యవసాయం - చరిత్ర

వ్యవసాయం కొత్తరాతియుగంలోనే మొదలైంది, కంచుయుగం నాటికి, క్రి .పూ 5000-4000 నాటికే సుమేరియన్లకు వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.సింధు లోయ నాగరికత నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.

ఆదిమానవులు మొదట జంతువు మాంసం కాయలు పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం నేర్చుకున్నారు. ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు పశుపోషణ మొదలైన వృత్తులు క్రీస్తు పూర్వం 7000 సంవత్సరంలోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి క్రీస్తుపూర్వం 3000 నాటికి ఈజిప్షియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధతులు ఎరువుల వాడకం సాగునీటి పద్ధతులు చేపట్టారు.

భారతదేశంలో వ్యవసాయం

ఖరీఫ్ పంట కాలం

జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగే పంటకాలం ఖరీఫ్ పంట కాలం అంటారు. ఈ  కాలంలో పండే పంటలు వరి జొన్నలు మొక్కజొన్న పత్తి చెరకు నువ్వులు వేరుశనగ.

రబీ పంటకాలం

అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగే పంటలు ఈ కాలంలో పండే పంటలు గోధుమ, బార్లీ ధనియాలు మొదలగునవి.

జైద్ పంటకాలం

మార్చి నుంచి జూన్ వరకు సాగే పంట కాలాన్ని జైద్ పంట కాలం అంటారు. ఈ కాలంలో పండే పంటలు పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలు మొదలైనవి.

సేంద్రియ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయం అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. 

Farmers in the field and doing work with their instruments
Farmers in the field 

సేంద్రీయ వ్యవసాయము రెండు పద్ధతులు ఉంది

 • మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు లేదా గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల విసర్జన), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కేరళ మరియూ ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో ఉంది.
 • రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్ధతి లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అను సహజ రసాయనంతో సాగుతుంది. ఇక కీటక నాశానులుగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం అను సహజ రసాయనాలు వాడబడతాయి.

వ్యవసాయ పనులు

 • దుక్కి దున్నడం 
పండించే పంట ముందు సరైన కాలంలో దుక్కిదున్నడం, మొట్టమొదటిసారిగా చేసే వ్యవసాయ సాగు పని దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నేలను దున్నడం వల్ల నేల గుల్ల భారీ మెత్తగా ఉంటుంది. అటువంటి నేలలో నీరు కారిస్తే భూమిలోకి ఇంకి అన్ని వైపులకీ ప్రవహిస్తుంది నేల మెత్తగా ఉంటే దాన్ని ఉపరితల వైశాల్యం పెరిగే ఆ నెలలో ఎక్కువ నీటిని నిలుపుదలకు సహాయపడుతుంది. దుక్కి దున్నడానికి నాగలి ఉపయోగిస్తారు.
 • భూమిని చదును చేయడం
పొలంలోని మట్టిగడ్డల వలన మేలు ఎగుడుదిగుడు ఉంటుంది. దానివల్ల ఆ నెలలో విత్తనాలు చల్లడానికి, నారు మొక్కలు వేయటానికి అనువుగా ఉండదు. చదును చేయడం వల్ల ఇబ్బంది ఉండదు మరి.

Tractor in the agriculture field doing work with help of farmer
Tractor in the Agriculture Field 

 • ఎరువులు వేయడం 
 • నీరు పెట్టడం 
 • దమ్ము చేయడం 
 • చదును చేయడం 
 • విత్తడం 
 • నారు నాటడం 
 • కలుపు మొక్కలు తొలగించటం 
 • నీటిపారుదల
 • ఎరువులు జల్లడం 

ఎరువులు మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషక పదార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్ ఆక్సిజన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి జింకు, మొదలగునవి. 

 • పురుగుమందులు చల్లడం 
 • పంట కోయడం 
 • కోసిన పంటను ఎండబెట్టడం 
 • కట్టలు కట్టడం 
 • గొప్ప వేయటం 
 • ధాన్యాన్ని వేరు చేయడం 
 • ధాన్యాన్ని బస్తాలు కి ఎత్తటం

వ్యవసాయ పనిముట్లు

వీటిలో మొదటిగా చెప్పుకో దగినది, అరక లేక మడక లేక నాగలి ఇది కొయ్యతో చేసినది. ఇందులోని బాగాలు- మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుముతో చేసినది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు, లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి. వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ చాల వరకు తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయ డానికి, గట్లు వేయడానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి, వుండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్థున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడా వచ్చాయి. రైతుకు చాల కష్టం తగ్గింది కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు.

కొడవలి

ఈ పని ముట్టును వరి కోతకు, ఇతర సన్నని పంటలను కోయ డానికి ఉపయోగిస్తారు. అలాగే పశువుకు గడ్డి కోయడానికి ఉవయోగిస్తారు. ఇది చిన్న కత్తి లాగె వుండి వంపు వైపు సన్నని రంపపు వళ్లు లాంటి పళ్లు కలిగి వుంటుంది. దానిని కక్కు అంటారు. కాలానుగుణంగా ఆ కక్కు అరిగి పోతుంటే మాటి మాటికి దానికి కక్కు వేస్తారు. కొంత కాలం తర్వాత అది చిన్నదై పోతుంది. ఆ చిన్నదైన కొడవలిని లిక్కి అంటారు. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అది- ఉంటే లిక్కి పోతె కొడవలి కొడవలి కత్తికన్నా చాల తేలికైన సాధనము. కొన్ని ప్రాంతాలలో కత్తిని కూడా కొడవలి అని అంటారు. ఉదాహరణకు.... "వేట కొడవలి కత్తి.

కత్తులు చాల రకాలు 

 • చిన్న కత్తి చిన్న పనులకు, అనగా చిన్న కొమ్మలు కొట్ట డానికి, చెరుకు కొట్టడానికి, వాడుతారు. 
 • పెద్ద కత్తి దీన్ని పెద్ద కొమ్మలు కొట్ట డానికి ఉపయోగిస్తారు. 
 • వేట కత్తి దీన్ని వేటను నరక డానికి, లావు పాటి కొమ్మలను నరకడానికుపయోగిస్తారు. వీటికి పదునెక్కువ 
 • కొంకి కత్తి ఇది చిన్నకత్తి కన్న తేలికగా వుండి దానికన్నా ఎక్కువ వంపు కలిగి వుండి, దానికి పిడి బదులు అక్కడ ఒక గొట్టం లాగ వుంటుంది. అందులో పొడవాటి వెదురు కర్రను దూర్చి వుంటుంది. దీన్ని గొర్రెల కాపరులు, మేకల కాపరులు వెంట తీసుకెళ్లి చెట్ల పైనున్న కొమ్మలను కోసి వారి జీవాలకు మేత వేస్తారు. దీనికి పదునెక్కువ. ఇది తెలికైన ఆయుదము. 
గొడ్డలి 

చిన్నగొడ్డలి, పెద్ద గొడ్డలి రెండు రకాలు. చిన్న దాన్ని చిన్న పనులకు, పెద్ద దాన్ని పెద్ద పెద్ద మానులను నరకడాని ఉపయోగిస్తారు. గొడ్డళ్లకు పదును ఎక్కువగా వుండదు. గొడ్డలి సంబంధించిన సామెత - గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు. 

తొలిక మెట్ట పైర్లలో కలుపు తీతకు, వేరుశనగ కాయలు త్రవ్వడానికి, మొదలగు వాటికి వాడుతారు. 

దీనితో భూమిలో వున్న చెట్లను వేళ్లతో సహా పెకలించ డానికి వాడే గొడ్డలి లాంటి పరికరము "పార". మట్టిని తట్టల కెత్తడానికి, అడుసులో అండ చెక్కడానికి, గట్టులు వేయడానికి, పొలాలకు, చెరుకు తోట వంటి తోటలకు నీరు కట్టడానికి పార చాల అవసరం. కాల క్రమంలో పార అరిగిపోయి చిన్నదైతె దాన్ని గొనంపార అంటారు.

మట్టిని త్రవ్వడానికి, పొలాల్లో రాళ్లను పెకలించ డానికి దీని వుపయోగం చాల వున్నది. కపిలి, గూడ, ఏతం, ఎద్దుల బండి వీటికి కావలసిన పరికరాలు అవి పని చేసె విధానం ప్రత్యేకంగా ఆయా వర్గాలలో వివరించబడ్డాయి. మంచె జొన్న, సజ్జ చేలలో మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక వేసి దానిపైకెక్కి కంకులపై వాలె పక్షులు, పిట్టలను తోలదానికి ఏర్పాటు చేసుకున్న సుమారు అయిదారు అడుగుల ఎత్తైన కర్రల వేదిక.

వడిసెల 

అరచేతి వెడల్పుతో అదే పరిణామంలో దారాలతో అల్లిన వల. ఆ వల రెండు చివరలన రెండు పొడవాటి దారాలు వుంటాయి. మధ్యలో ఒక రాయిని పెట్టి రెండు దారాల కొసలను చేర్చి కుడి చేత్తో పట్టుకొని తలపి గిర గిరా వేగంగా తిప్పి ఒక దారం కొసను వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్ళి పడుతుంది. పొలాల్లో పక్షులను తోల డానికి దీన్ని వాడతారు. కాని దీన్ని గురి చూసి కొట్ట డానికి లేదు. పూర్వం వడిసెలను యుద్దాలలో కూడ వాడినట్లు ఆదారాలున్నాయి.

కొడము 

తోటలో తమలపాకులు కోయడానికి బొటన వేలుకి వేసుకునే ఇనుప రేకు గోరు. దీని వలన వేళ్లకు నొప్పి లేకుండా వుంటుంది. 

గాలము 

ఇది కొబ్బరి లేదా వెదురు పుల్లలతో అల్లిన చేపలు పట్టే పరికరం. ఇది కూడా చేపలు పట్టడానికుపయోగించే చిన్న ఇనుప కొక్కెం. సూది ఇది బట్టలను కుట్టుకునే సాదారణ పరికరం.
ముల్లు గర్ర - ఇది సన్నని వెదురు కర్ర. దాని చివరన కొసగా చెక్కి వుంటుంది. దీన్ని దుక్కి దున్నేటప్పుడు ఎద్దులను అదిలించ డానికి వాడుతారు.

కాడిమాను  

ఇది కొయ్యతో చేసినది. దీన్ని ఎద్దుల మెడపై వేసి బండికి,  నాగలి వంటి పనిముట్లుకు కట్టి ఎద్దులతో పని చేయించడానికుపయోగిస్తారు. ఎద్దులతో ఏ పని చేయించాలనా ఎద్దుల మెడపై కాడిమాను పెట్టాల్సిందె. కాడి మాను పైకి లేపగానె ఎద్దులు తలలు వంచి దాని కిందికి దూరి కాడిమానును తమ మెడలపై వుంచుకుంటాయి. 


పలికి మాను 

ఇది నాలుగడుగులు పొడవున్న కర్ర దుంగ. దానికి సుమారు పది రంద్రాలు చేసి దానికి ఒక జానెడు పొడవున్న కర్ర ముక్కలను బిగించి వుంటారు. దీన్ని వెలి దుక్కి దున్నిన తర్వాత ఆ సాళ్లలో ఏదేని విత్తనాలు వేసిన ఆ సాళ్లను పూడ్చడానికి వాడతారు.

పందిలి పైనున్న గడ్డిని, తీయడానికి, చిన్న చెట్లను ఎక్కడానికి దీనిని ఉపయోగిస్తారు. 

కాడి ఎద్దులు 

అంటే రెండు ఎద్దులు. కుడి పక్కది, ఎలపట.. ఎడం పక్కది దాపట అని అంటారు.. ఎద్దులు ఎప్పుడు దుక్కి దున్ను తున్న, బండి లాగుతున్న, లేదా రోడ్డు మీద నడుస్తున్న. పనిలో వున్నప్పుడు ఇంటి వద్ద కొట్టంలో కట్టేసి వుంచినా అవి ఆ వరుసలో మాత్రమే వుంటాయి. కుడిది ఎడం పైపుకు గాని అటుది ఇటు గాని వుండవు. చ్చో అంటే ఎలపటది, టుర్ర్ ర్ అంటే దాపటది తిరుగు తాయి. వంపు తిరగటానికి ఈ మాటలను వాడతారు. దుక్కి దున్నేటప్పుడు ఒక సాలు అయిన తర్వాత దాని పక్కనే ఇంకో సాలు దున్నాలి. అలా దున్నాలంటే సాలు చివరన ఎద్దులను తిప్పి సరిగా ఆ సాలు వెంబడే ఇంకో సాలు దున్నాలి. ఇది కొంత ఆలస్యం అవుతుంది. అందు చేత సాలు చివరన ఎద్దులను ఇంకొంత దూరం సుమారు పది అడుగులు పక్కకు పోనిచ్చి అక్కడ ఇదివరకు దున్నిన సాలుకు సమాంతరంగా ఇంకో సాలు దున్నుతారు. దాన్ని కొండ్ర అంటారు. ఆ కొండ్ర చివరన ఎద్దులను మలిపి ఇదివరకు దున్నిన సాలు వెంబడి సాలు వేస్తారు. ఆ కొండ్ర పూర్తి కాగానె ఇంకో కొండ్ర వేస్తారు. రోజలు మారాయ్ అనె పాత సినిమాలో వ్వవసాయానికి సంబంధించిన పదాలు ఒక పాటలో కొన్ని ఉన్నాయి. అది....... ఏరు వాక సాగారో ... రన్నో ..... చిన్నన్న........ నీ కష్టమంతా తీరెను రో రన్నో చిన్నన్న.. ఎలపట దాపట ఎడ్ల కట్టుకొని, ఇల్లాలిని నీ వెంట బెట్టుకొని, ,,,,,,,, సాలు తప్పక కొండ్ర వేసుకొని విత్తనాలు విసిరిసిరి చల్లుకో....... ఏరువాక సాగారోరన్నో చిన్నన్న..... 

ఎద్దుల బండ  

రైతులకు ఇది అతి ముఖ్యమైన సాధనము. పొలములోని పంటను ఇంటికి చేర్చడానికి, ఇంటి వద్దనున్న దిబ్బలోని ఎరువును పొలానికి చేర్చడానికి ఇది ముఖ్యమైన సాధనం. దీనిని వడ్రంగి తయారు చేస్తాడు. రెండెడ్లతో నడిచే ఈ బండి కాలాను గుణంగా మార్పులు చెందుతూ టైరు చక్రాలతో నడిచే విధంగా రూపు దిద్దుకొన్నది. ఇందులో కొన్ని రకాలున్నాయి. అవి గూడు బండి, సవారి బండి. వీటిని సంతలకు సరకులను రవాణ చేయడానికి, మనుషులను రవాణాకు వాడె వారు. ఒంటెద్దు బళ్లు కూడా వుండేవి. గూడు బళ్లు, సవారి బళ్లకు ఏ నాడో కాలం చెల్లి పోయింది. మామూలు ఎద్దుల బండ్లు మాత్రం అరుదుగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి, వీటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. ఇవి ఎద్దులు చేసె అన్ని పనులు చేస్తున్నాయి. పైగా అతి వేగంగా పని జరుగుతున్నది.
నాగలి గొడ్డలి కొడవలి పలుగు పార రథము ఎద్దుల బండి ట్రాక్టర్ మొదలగునవి చాలా పరిశ్రమలు ఉన్నాయి ఉన్నాయి. 

వ్యవసాయ పనిముట్లు
 • నాగలి (Plough) 
 • గొడ్డలి (Axe) 
 • కొడవలి (Sickle) 
 • పలుగు (Iron crowbar) 
 • పాఱ (Spade) 
 • ఏతము (Picotta) 
 • ఎద్దుల బండి (Bullock cart) 
 • ట్రాక్టర్ (Tractor)
గుంటక గొర్రు - నీటిని పైకి తోడి పంటలకు పారించే విధానంలో కపిలి, గూడ, ఏతం, (ఇవి గతంలో విరివిగా వాడకంలో వుండేవి, ఇప్పుడు తక్కువ వాడుచున్నారు).

చేతి పనిముట్లు
 • తొలిక 
 • కొడవలి 
 • కత్తి 
 • గుద్దలి 
 • కొంకి 
 • పిక్కాసు 
 • చెరుకు నుండి రసం తీయడానికి వాడే యంత్రం. 
 • గానుగ గింజల నుండి నూనె తీయడానికి వాడే యంత్రం. 
 • గానుగ గింజల నుండి పప్పులను పిండి చేయడానికి వాడే యంత్రం. 
 • రుబ్బు రోలు, విసుర్రాయ పంట ఉత్పత్తి
వ్యవసాయ పెట్టుబడులు 

విత్తనాలు, లభ్యత మొక్కలు వేయుటకు పదార్థాలు ఎరువులు, పురుగుల మందులు, సేంద్రియ ఎరువు, పురుగు మందుల తయారీ నిర్వహణ మొదలైన విభాగంలో ఉన్నాయి.
ఉత్పత్తి పరిజ్ఞాణం

విత్తన శుద్ధి పంటల ఉత్పాదన కొరకు సాంకేతిక పద్ధతులు పోషక నిర్వహణ నీటిపారుదల నిర్వహణ నియంత్రణ ఉత్పత్తి కణజాల వర్ధనం సహా పంటలు విజయవంతమైన నిర్మాణంలో చేరి టెక్నాలజీ ఎస్ ఈ విభాగంలో ఉన్నాయి. 

పంటకోత అనంతర పరిజ్ఞాణం

మామిడి అరటి బొప్పాయి పండును శాస్త్రీయంగా పండించడం పంటకోత అనంతర తృణధాన్యాలు పప్పు దినుసులు పండ్లు కూరగాయలు ఏ విధంగా నిల్వ చేయాలి చల్లని సౌకర్యాలు ఆహార భద్రత ప్రమాణాలు ఈ విభాగంలో వివరించడం జరిగింది. 

వ్యవసాయ పరికరాలు 

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పరికరాలను వాడటం వల్ల చాలా సమయం శ్రమతో కూడుకున్నది కొత్త వ్యవసాయ పరికరాలు కొత్త పద్ధతుల వలన తొందరగా పనులు జరగడం పంటల ఉత్పాదకత పెరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం అంటే కీలకపాత్ర రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువమంది తమ జీవనోపాధి కోసం పూర్తిగా లేదా అధిక భాగం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు పేదరిక నిర్మూలనకు వ్యవసాయాభివృద్ధి కీలకమవుతుంది. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని పేదరికాన్ని తగ్గించవచ్చు గత కొన్ని దశాబ్దాల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం గణనీయమైన మార్పులకు లోనయింది ముఖ్యంగా 80వ దశకంలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి.

వ్యవసాయ సంరక్షణ పద్ధతులు

ఉదరబెట్టడం 

వరి పంటలో గింజలు ముదిరాక ఎలుకలు బాగా రైతులు ఎదుర్కొంటున్నారు ఎలుకలు బొరియలు చేసుకుని రాత్రివేళల్లో వారు తమ దోచుకుంటాయి.  వీటి వలన రైతులు చాలా నష్టం కలుగుతుంది ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్వం విషపు బిళ్లలను సరఫరా చేస్తుంది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది.

జీవామృతం

 జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటాయి. జీవన ద్రవంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరం మెట్ట పొలాల్లో గడ్డి లేకపోతే భూమిని పైపైన చేసి ఆచ్ఛాదన కలిగించవచ్చు.

దిష్టిబొమ్మ 

దిష్టిబొమ్మను ఆంగ్లంలో స్కేర్ కో అంటారు. కేర్ అంటే బెదిరించటం క్రో అంటే కాకి దీనిని బట్టి కాకుండా బెదిరింపు కొట్టడానికి తయారు చేసుకున్నా బొమ్మను దిష్టి బొమ్మ అంటారు.

వ్యవసాయంలో అనేక ప్రమాదాలు

వ్యవసాయంలో అనేక ప్రమాదాలు ఎదురౌతూంటాయి, ఇదొక ప్రమాదకరమైన పని. రైతులు, రైతు కూలీలు పామూ పుట్రల కాట్లకు గురౌతూంటారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో కూడా వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా జరుగుతుంది.

ఉపాదీ

స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో వివిధ ఉపాధి అవకాశాలున్నాయి. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకి సంబంధించిన వివిధ ప్రాంతీయ కేంద్రాలలో, కృషి విజ్ఞాన కేంద్రాలు, నేషనల్ డెయిరీ రీసెర్చ్, ఫారెస్ట్ రీసెర్చ్, వెటర్నరీ రీసెర్చ్, కమోడిటి బోర్డులు, సహకార సంస్థలలో వివిధ స్థాయిలలో ఉద్యోగాలుంటాయి. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, వ్యవసాయ క్షేత్ర మేనేజర్, విషయ నిపుణులు (అసోసియేట్ లేదా ఫెలో స్ధాయి), శాఖాధిపతి, ప్రిన్సిపల్ సైంటిష్టు, అసిస్టెంట్ కమీషనర్ ల పేర్లతో ఉపాధి అవకాశాలుంటాయి.

ప్రైవేటు రంగంలో విత్తనాల ఉత్పత్తి, పురుగు మందులు, ఎరువులు శాఖలలో, బ్యాంకులలో వ్యవసాయ ఋణాలు మంజూరుకు, బీమా సంస్థలలో, వివిధ మాధ్యమాలలో వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనకి విషయ నిపుణులుగా, వ్యవసాయానికి సంబంధించి రకరకాల ఉపాధి అవకాశాలున్నాయి.

వ్యవసాయం - మానవాళికి అందించిన ఒక వరం 

ప్రజలు బతకడానికి తిండి కావాలి. అది వ్యవసాయంలో రైతుల ద్వారా లభిస్తుంది. కాని రానున్న రోజుల్లో రైతులు అంతరించిపోతున్నారు. సరైన అవకాశాలు లేక అందరూ ఉద్యోగ అవకాశాలు కోసం పట్టణాలు నగరాల్లో చేరుతున్నారు. రాను రాను రైతులకు దిక్కు లేకుండా పోతుంది. కాబట్టి మనం రైతుల విలవలను తెలుసుకుందాం. వారిని ప్రోత్సహిస్తూ భావితరాలకు వ్యవసాయం రైతు విలువను తెలుపుధాం. వ్యవసాయం లేకపోతే మనకి తినడానికి తిండి వుండదు. రైతు కష్టపడి పంట పండించక పోతే మనం ఈ సృష్టి లో బతకలేము. కాబట్టి వ్యవసాయ వృత్తి నీప్రోత్సహించుడాం. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్