పర్యావరణం మరియు కాలుష్య కారణాలు
కళ్ళు చెదిరే ప్రకృతి సోయగాలతో, పచ్చటి శోభ లను సంతరించు కుంటు, ప్రకృతి అందాలతో మనల్ని మనం మర్చిపోయేలా చేసి తన్మయత్వంలో ముంచి తేల్చే రమ్యమైన కళాఖండం ఈ పర్యావరణం, ఇది సహజ సిద్ధమైనది.
మనం నివసించే ప్రదేశాల్లో చుట్టూ ఉండే ప్రాంతాన్ని, పరిసరాలను దీనిలో వుండే మౌళిక విషియాలను పర్యావరణ అంటారు. పర్యావరణం భూమి, గాలి, అగ్ని, సహజ వాయువుల అన్నింటి మిశ్రమం.
మన చుట్టూ వుండే గాలి, నీరు, నేల, మొక్కలు, జంతువులు, వాతావరణం వీటన్నిటి కలిపి పర్యావరణం అంటారు. ఈ సృష్టిలో సమస్త జీవ కోటి ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది. మనకి కావలసినవి సరిగ్గా చూసుకుంటే మన ప్రకృతి నుండి లభిస్తుంది. ప్రకృతి చాలా అందమైనది, విశాలమైనది, ఆకర్షనీయమైనది. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది.
పర్యావరణం అసలు ఎందుకు కాలుష్యం అవుతుంది, దీనికి కారణాలు ఏంటి
పర్యావరణం కాలుష్యం చేయడం లో చాలా శక్తులు కలిసి వున్నాయి.కాలుష్యం 3 రకాలుగా చెప్పుకోవచ్చు.
- భూ కాలుష్యం
- వాయు కాలుష్యము
- నీటి కాలుష్యం
భూ కాలుష్యం
చెత్త, చెదారం, బైట పడివేయడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. దుమ్ము, ధూళి, వ్యర్త పదార్థాలు, మురికి కాలువలు, భూమిలో కలవకుండా వుండే ప్లాస్టిక్ ఈ భూ కాలుష్యానికి తోడ్పడతాయి.
వాయు కాలుష్యము
పర్యావరణంలో వాహనాల నుండి వెలువడే పొగ వలన వాతావరణంలోకి చేరి కాలుష్యంనీ ఏర్పరుస్తున్నాయి. దీని వలన హానికర రసాయనాలు వెలువడుతున్నాయి.
నీటి కాలుష్యము
నీటిలో చేరే వ్యర్థ పదార్దాలు, చెత్త, చెదారం కాలుష్యం చేస్తుంది. నీరు మురికిగా మారడం వలన చాలా రకాల జబ్బులు వస్తాయి.
కాలుష్య కారకాలు
నేడు మానవుడు తన మేథో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరజ్ఞానంతో పెంపొందించుకుని ప్రపంచంలో పరిశ్రమలు వెలువడుతున్నాయి. దీని ద్వారా గాలి, నీరు, తినే ఆహారం అన్ని కాలుష్యం అవుతున్నాయి. అంతే కాక మానవుడు వాహన వేగం పెంచుతూ ఇంధన కొరతకు కారణం అవుతున్నాడు. దీని ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ వంటి విష పూరిత వాయువులు వెలువడి భూమి వెడుక్కుతుంది. జలవనరులు తగ్గిపోతున్నాయి. కాగితం తయారీ కోసం కొన్ని వందల చెట్లు నారుకుతున్నారు. దేశ జనాభా పెరిగి సౌకర్యాలు తక్కువ అవుతున్నాయి. ఆరోగ్యం కి సంబందించిన సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఉద్యోగం, పరిశ్రమలు కోసం ఇందనాలు వాడడం. బొగ్గు, పెట్రోలియం వాడకం తగ్గుతుంది. మానవుడు లేచిన మొదలు రాత్రి నిద్రించే వరుకు కాలుష్యంలో బతుకుతున్నాం.
- వాహనాల నుండి వెలువడే పొగ
- చెట్ల నరికివేత
- వ్యర్థాలు, చెత్త బయిట పడేయడం
- నీటి కాలుష్యము
- వాయు కాలుష్యము
- ప్లాస్టిక్ వాడకం
- అపరిశుభ్ర వాతావరణం
- పర్యావరణం పచ్చగా లేకపోవడం
కాలుష్యం నివారణకు తీసుకోవలసిన బాధ్యతలు
మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మన కనీస బాధ్యత. ఇంధన వాడకం తగ్గించాలి. కాలుష్యం కలిగించే వస్తువుల వాడకం తగ్గించాలి.
ప్లాస్టిక్ వల్ల కాలుష్యం
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ భూమిలో కొన్ని వందల సంవత్సరాలు వరుకు విలీనం కావు. దీని వలన జీవ కోటికి ప్రాణనష్టం జరుగుతుంది. పర్యావరణం కాలుష్యం అవుతుంది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.
చెట్లు పెంచడం వలన కాలుష్యం నియంత్రణ
కాలుష్యం నివారణ వలన జరిగే ఉపయోగాలు
ఇంటి దగ్గర చెట్లు నాటండి. ఇంట్లో వుండే చెత్తని కాల్చవద్దు, చెత్త కుండీలో వేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ వాడరాదు. ఇంటి నుండి మంచి నీరు, సంచులను తీసుకుని వెళ్ళండి. ఇంధన వాడకం తగ్గించండి.
మీకు పనికి రాని వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి. పర్యావరణం దినోత్సవం రాగానే చట్టాలు మరింత కటినంగా వుండాలనే వాదనకు వినిపిస్తాయి. ఐతే పర్యావరణం పరిరక్షణకు చట్టాలు ఒకటే సరిపోవు.. పర్యావరణ నీ మన జీవన విలువలలో ఒక భాగంగా చేసుకోవాలి.
నీటిని పొదుపు చేయడం, రసాయనాలు లేకుండా వ్యవసాయం. ఇంధనాలు నుండి వెలువడే కాలుష్యం తగ్గించాలి. నదులు పునర్జీవింపచేయడం, మొక్కలునీ పెంచడం వ్యర్థాలను ఉత్పత్తి చేయని జీవన విధానాలునీ ప్రారంభించాలి.
నిజం చెప్పాలంటే మనిషిలో దురాశ కాలుష్యానికి కారణం. సంకటిక అభివృద్ధ, విగ్యానశాస్త్రం అనేది మన అవసరాలకి తీర్చుకోవడానికి, మంచికి ఉపయోగించాలి. కాని పర్యావరణం నాశనంకి ఉపయోగిస్తున్నారు. నిజానికి టెక్నాలజీ అభివృద్ధి కాలుష్యానికి గాని, చెత్తనిగాని సృష్టించవు.
టెక్నాలజీ మంచికి వాడిన, చెడుకి వాడిన అది మన చేతుల్లోనే వుంది. సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా, సౌర శక్తి ద్వారా మన సాంకేతిక అభివృద్ధి చేసుకోవాలి. ప్రకృతి వనరులను వాడుకోవడం ద్వారా ప్రజలకి విజ్ఞామ్, సుఖం అందించడం సాంకేతిక ఉద్దేశ్యం, కాని మానవ విలువలు మరిచిపోయినపుడు సుఖానికి బదులుగా, వినాశనానికి, కలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మనం మన పర్యావరణంనీ కాపాడుకుందాం. అది మన చేతుల్లో వుంది. భావి తరాలకు మన ప్రకృతి సంపదని అందిద్దాం.
పచ్చదనాన్ని పెంచుదాం.... పరిశుభ్రంగా ఉంచుదాం.....ఆరోగ్యం గా ఉందాం....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి