ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వేసవి తాపం నుండి కాపాడుకోవడం

వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వేసవి తాపం 

వేసవి కాలం వచ్చిందంటే చాలు భగభగమండే సూర్యుడు మనపై వేడి తాపం చూపుతాడు. ఈ మండే ఎండా నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనం కొన్ని ముందంజు జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు ప్రతి ఏటా మన భారతదేశంలో లక్షలాది మంది స్కిన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు

వేసవిలో తీసుకోవలసిన ఆహార జాగ్రత్తలలో ముఖ్యమైనది కూరగాయలు   :-

పాలకూర, ముల్లంగి, ఉల్లి, వెల్లులి, బీట్రూట్, అనాస, మామిడి వంటివి  శరీరంలో వేడిని అంటే శరీరం యొక్క తాపాన్ని తగ్గించే ఆహరం.  తాజా పండ్లు తినాలి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని త్రాగడం వల్ల వేడి ప్రభావం తగ్గుతుంది. చెమట రూపంలో కోల్పోయిన లవణాలు తిరిగి పొందాలి అంటే మజ్జిగ (Butter Milk), కొబరి నీళ్లు (Coconut Water), నిమ్మరసం (Lemon Juice), లాంటివి తరచుగా తాగాలి.
Pineapple juice is good in summer season and it gives body coolness
పైన్ ఆపిల్/ అనాస పండు


వేసవి కాలంలో తాపాన్ని తగ్గించే చిట్కాలు 

 • రోజుకి 1 ఆపిల్ 
 • రోజుకి 1 తులసి ఆకు - కాన్సర్ 
 • రోజుకి 3 లీటర్ల నీరు - రోగాలు దరి చేరవు

సమ్మర్ లో ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి మనం రోజు వండే వంటల్లో వాడే పదార్దాలు ఆకుకూరలు కూరగాయల్లో పోషక పదార్దాలు చాలా రోగాలు నయం చేస్తాయి. ఇది మూడువంతుల రకాల రోగాలను దూరం చేస్తుందట. పోషకవిలువలు ఉన్నవాటిలో మునగది ప్రత్యేకం. అందుకే మునగాకును పోషకాల గని అనడంలో అతిశయోక్తి లేదు. వేసవికాలంలో చల్లని పానీయాలు తాగడం వల్ల ఆరోగ్యం ముప్పుతిప్పలు పెడుతుంది రక్తనాళాలు నిర్మాణం అడ్డుకొని అనారోగ్య సమస్యలు దారితీస్తాయి.

వేసవి కలం కాయకురాలు

తాజాగా ఉండే సీజనల్ వెజిటబుల్స్ , గ్రీన్ లిఫీ వెజిటబుల్స్ లో 80-90% నీరు ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో నీరు ఎక్కువగా తీసుకోవడం శరీరం తాపం తగ్గును  

వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ప్రతిరోజు 2 లీటర్ నీరు ఖచ్చిత్తంగా తాగాలి. వేసవి కలం లో మన శరీరానికి నీరు చాల అధికంగా అవసరం అవును. నీరు శరీరం యొక్క ఉష్ణోగ్రత అంటే శరీరం యొక్క తాపాన్ని తగ్గిస్తుంది కావున శరీరం కొంత చల్లగా ఉందును. 

వేసవి లో పండ్ల రసం 

ఫ్రూట్ జ్యూస్ లను తీసుకోవాలి ఆరంజ్, పైనాపిల్, సీజనల్ ఫ్రూట్స్, మరియు నిమ్మరసం మజ్జిగ లస్సి వంటి బేవరేజ్లు సమ్మర్ లో చాల అవసరం. ఈ పండ్ల రసాలు శరీరానికి చల్లదనాన్ని కాదు శక్తిని కూడా ఇస్తుంది. వేసవి లో చాల మందికి ఆహరం కన్నా పానీయాల పై మక్కువ ఎక్కువ కావున పండ్ల రసాలు లేదా నిమ్మరసం లేదా మజ్జిగ వంటి తాపాన్ని తగ్గించేవి తీసుకోవాలి. 

వేసవి కాలంలో వడదెబ్బకు గురి ఎలా అవుతారు 

ఎండలు ఎక్కువైనప్పుడు తీవ్ర వేడిగాలులు వీచినప్పుడు వడదెబ్బకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరగడం వలన అంటే ఒక గొడుగు వంటివి తీసుకువెళ్లకుండా వడదెబ్బకు గురి అవ్వును.

వడదెబ్బకు నుండి కాపాడుకునే చిట్కాలు 

Orange juice is most people like it. It gives immunity power to body
ఆరంజ్ జ్యూస్ / నారింజ రసం 

 • వడదెబ్బకి  గురైన వ్యక్తిని వెంటనే నీడకి తీసుకెళ్లాలి. 
 • అతని శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. 
 • ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్, ఓ ఆర్ యస్, కలిపిన నీటిని త్రాగించాలి. 
 • ప్రధమ చికిత్స అనంతరం దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.
వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన  చిట్కాలు

 • పుచ్చకాయ రసంగాని, బార్లీ జావలో పటిక బెల్లం కలిపిగాని, లేక కొబ్బరినీళ్లు కాని తాగాలి. 
 • సబ్బజ గింజలు శరీరంలో చల్లదన్నాని కలిగిస్తాయి. 
 • నీళ్లు ఎక్కువగా తాగాలి మత్తు పానీయాలు తీసుకోరాదు. 
 • చల్లని నీటితో స్నానం చేయాలి. 
 • వదులైన దుస్తులు ధరించాలి, తెల్లని నూలు వస్త్రాలు ధరించాలి. 
 • ఎక్కువ సేపు ఎండలో బయట తిరగకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే టోపీ కళ్లద్దాలు ధరించాలి.
వడదెబ్బ లక్షణాలు
 • చెమట పట్టకపోవడం, నీరసం, సత్తువ తగ్గడం. 
 • శరీరం ఎర్రబడటం, పొడిబారడం, కళ్ళు తిరగడం. 
 • తలనొప్పి, దురదలు, వాంతులు, అధిక చెమట. 
 • స్పృహ కోల్పోవడం, పసుపు వర్ణంలో మూత్రం. 
 • ఆందోళన, కండరాలు పట్టేయడం, నాలుక తడి ఆరిపోవడం. 
 • ఇది సాధారణంగా మార్చి నుండి జులై వరకు ఎండ తీవ్రత అధికం.
వేడి తిమ్మిర్లు 
 • కండరాలు పట్టేయడం, మూర్ఛ, 102 డిగ్రీల వరకు జ్వరం. 
 • వేసవి కాలంలో ద్రవపదార్దాలు తగిన మోతాదులో తీసుకోవాలి. దీనివలన ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణానికి ప్రమాదం ఉండదు. 
 • వడదెబ్బతో పల్స్రేట్ పెరిగి, శ్వాస పీల్చడం కష్టం అవుతుంది. శరీరానికి నీరునిచ్చే పుచ్చకాయలాంటి ఆహారంతో పాటు ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి సోడా తాగవచ్చు. 
వేసవిలో టీ తాగడం చాల మంచిది  

చలికాలం కాఫీని ఎంపిక చేసుకుంటాం అయితే సమ్మర్ లో టీ తాగాలి శరీరానికి కావలసిన చల్లదనం అందిస్తుంది.

వేసవిలో ఆహరం 

All types of fruit juice good for health
ఫ్రూట్ జ్యూస్ /పళ్ళ రసం 

ఒకసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఆహరం చాలా చిన్న చిన్న మోతాదులో గ్యాప్ ఇస్తు తినాలి. దీని వలన వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది.

వేసవి లో చల్లని నీటితో స్నానం

వేసవిలో అప్పుడప్పుడు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది, కావున వేసవి తాపం తగ్గును, లేదంటే గోరువెచ్చని నీటితో అయిన స్నానం చేయాలి.

వేసవి యోగా

వేసవిలో యోగా ద్వారా మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు ఇ ప్రాణాయామం అంటే అనులోమ విలోమ బ్రార్మిరి మరియు ఉజ్జయి ప్రధాన శ్వాస సంబంధిత ప్రయోగాలు ఇవి మన శరీరాన్ని చల్లగా మరియు ప్రశాంతంగా ఉంచుతుంది.

వేసవి కాలంలో బ్యూటీ టిప్స్

 • కొద్దిగా చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడగాలి అర స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ నిమ్మరసం మిశ్రమం బాగా కలిపి ముఖానికి, మెడ వెనుక రాసి అరగంట తర్వాత సున్నిపిండి లేక శెనగపిండి లేదంటే పెసరపిండితో ముఖం, చేతులు మెడ వెనుక చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. 
 • రాత్రి సమయంలో సబ్బులు వాడరాదు మేకప్ వేసుకోకూడదు.
బ్లాక్ హెడ్స్ (వేసవి లో నల్ల మచ్చలు) 

కొద్దిగా నిమ్మరసం, సమానంగా గ్లిసరిన్ కలపాలి ఈ మిశ్రమాన్ని స్నానం చేయబోయే అరగంట ముందు ముఖం మీద మసాజ్ చేయాలి. అరగంట తర్వాత సెనగపిండి, సున్నిపిండితో స్నానం చేయాలి, సబ్బులు మాత్రం ఉపయోగించరాదు ఇలా మూడు నాలుగు రోజులకి ఒకసారి, ఒక నెల రోజులు చేసినట్లుయితే మొటిమలు, నల్లమచ్చలు, బారి నుండి విముక్తి పొందవచ్చు.

పొడి చర్మం

ముఖం పై మచ్చలు

 • బంగాళదుంపని సన్నని ముక్కలు తరిగి జ్యూస్ చేయండి, సీసాలో దీన్ని భద్రం చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచి 4,5 రోజులు దీన్ని ఉపయోగించవచ్చు. ఈ బంగాళ దుంప జ్యూస్ తో నిత్యం ఒకటి రెండు సార్లు ముఖం కడిగేసుకొని, ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి. 
 • కలబందని మనం ముఖానికి రాసుకుంటే అది చర్మాన్ని మృదుత్వంగా ఉంచి చల్లని ఉండేలా చేస్తుంది. 
 • నిమ్మరసం ముఖానికి రాసి అరగంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడగాలి.

వేసవిలో వేసుకోవలసిన దుస్తులు 

వేసవి కాలంలో ఎక్కువగా తెలుపు, కాటన్ దుస్తుల్ని ధరించాలి. ఎందుకంటే ఇవి శరీరానికి పట్టే చెమటని పీల్చుకుంటాయి, ఎండా వేడిని తట్టుకుంటాయి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వేసవి కాలంలో దుస్తులు వదులుగా ఉండేలా ధరించాలి, బిగుతుగా ఉంటే శరీరం ఎర్రగా మారి చెమటకాయలు ఏర్పడి మండుతుంది. కాబట్టి శరీరానికి వేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుపు రంగు, మందంగా ఉన్న దుస్తులు ధరించరాదు.

వేసవి కాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు

 • బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు తప్పనిసరిగా వెంట తీసుకోని వెళ్ళాలి. 
 • వేసవిలో ద్రవ పదార్దాలు మజ్జిగ నీరు పండ్ల రసాలు తీసుకోవడం వలన ఆరోగ్యంతో  పాటు అందానికి డోకా ఉండదు. 
 • ఎండలో నుండి రాగానే పచ్చిపాలలో దూదిని ముంచి చర్మాన్ని తుడవండి. 
 • వేసవిలో సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాలలో ఉండాలి, వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. 
 • మిట్ట మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య ఎండలో తిరగకుండా ఉండడం ఉత్తమం. 
 • చక్కని వెంటిలేషన్, తలుపులకు తెరలు ఉండాలి. 
 • ఇంటి పై కప్పు మీద గడ్డి లాంటివి ఉంచి చల్లని నీరు పట్టించాలి. 
 • గది ఉష్ణోగ్రత్తలు తగ్గించాలి, స్నానం రోజుకి రెండు సార్లు చేయాలి. 
 • ఈ విధంగా జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి తాపం నుండి సులువుగా బయట పడచ్చు.
 • వేసవి కాలంలో కరోనా వైరస్ తగ్గవచ్చు అని శాస్త్రవేత్తలు అంచన. 
 • వేసవి కాలంలో చెట్టు నీడలో ఉండడానికి ఇష్టపడం

వేసవి కాలం

వేసవి కాలం అనేది నాలుగు సమశీతోష్ణ కాలాల్లో వెహ్హని కాలంగా చెప్పవచ్చు. ఇది వసంత ఋతువు అకురాలే కాలం మద్య వస్తుంది. ఈ కాలంలో ఎక్కువ గంటలు వెలుతురు, తక్కువ గంటలు చీకటి వుంటుంది.

సమయం  

వాతావరణం శాస్త్ర నిపుణులు ప్రకారం వేసవి కాలం ఉత్తర అర్థ గోళం లో జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో వుంటుంది.దక్షిణ అర్థ గోళం లో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలో వస్తుంది.ఈ  సంవత్సరం లో దీర్ఘ కాలిక పగటి సమయాన్ని గుర్తించవచ్చు.ఈ సమయం లో పగటి కంటి ఎక్కువగా వుంటుంది.మన భారత దేశంలో వేసవి కాలం మార్చి నెలల నుండి మే వరుకు వుంటుంది.ఈ సీజన్ల లో..వేసవి కాలం వలన చాలా ప్రాంతాలు వేడి గాలులను ఎదురకుంటు వుంటాయి.సూర్యుడి నుండి వేడిని తాకుతాయి.ఈ వేసవి కాలంలో.చాలా ప్రాంతాలు..నీటి కొరతను ఎదుర్కుంటూ వుంటాయి.. అంతే కాకుండా ఈ వేసవి కాలం లో ప్రజలు చాలా..వేడిని తట్టుకునే శక్తిని కలిగి వుండాలి.ఎండ వేడికి వడ దెబ్బ , కళ్లు తిరగడం, ఆయాసం,  వంటివి చాలా వస్తాయి. కాబట్టి ఈ సమయం లో ప్రజలు..బయటకి ఎక్కువగా రారు.ఈ సమయం లో.. ఉష్ట్నోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ నుండి 45 డిగ్రీల సెల్సియస్ కు మారుతూ వుంటుంది.

వేసవి కాలంలో వాతావరణం  

వేసవి వాతావరణం సంప్రదాయకంగా వేడి లేదా వెచ్చని వాతావరణాన్ని కలిగి వుంటుంది.మధ్యధరా సముద్రం లో ఎదింపొడి వాతావరణాన్ని కూడా ముడి పడి వుంటుంది.తడీ  కాలం సవన్నా  వాతావరణ కాలం లో వృక్ష సంపద వృద్ధికి ప్రధాన కాలం.తడి కాలం ప్రస్తుత గలులలో కలనుగుణ మార్పులతో సంబంధం కలిగి వుంటుంది.

వేసవి లో పాఠశాల సెలవులు

ఎక్కువ దేశాల్లో ఈ వేసవి కాలం సమయం లో సమయలో పాఠశాల కు సెలవులను ఇస్తారు. ఐతే తేదీలు మారతాయి. ఉత్తర అర్థ గోళం లో కొన్ని మద్య మే లో ప్రారంభం అవుతాయి.దక్షిణ అర్థ గోళం లో పాఠశాల సెలవులు క్రిస్మస్, నూతన పండగ వంటి సెలవులు కూడా చేరుతాయి.వేసవి సెలవులు క్రిస్మస్ కొన్ని వారాల  జనవరి ముగింపు నుండి మద్య  ఫిబ్రవరి లో ముగుస్తాయి.వేర్వేరు రాష్ట్రాల్లో తేదీలు మారతాయి.

కార్యకలాపాలు

వేసవి కాలం లో అధికంగా వేడిగా వుండడం వలన ప్రజలు బయటకి రారు.అధిక సమయం బయిట ప్రదేశాల్లో వెచ్చని ఉస్త్నోగ్రతలకి విశ్రాంతి తీసుకుంటారు.ఈ కార్య చరణాల్లో వేసవి నెలల్లో సముద్రపు ఒడ్డుకు,విహార యాత్రలు కు వెళ్ళడం వంటివి వుంటాయి. క్రికెట్, వాలి బాల్, బేస్ బాల్,, సాకర్, టెన్నిస్, ఫుట్ బాల్ క్రీడలు వాడతారు.నీటి మంచి పై జారే సాధనం అనేది వేసవి లో ప్రత్యేకమైన క్రీడా. వలే చెప్పవచ్చు.నీళ్లు ఆ సమయంలో లోని వారి వెచ్చని కాలానికి ప్రయత్నించినపుడు ఉపయోగ పడుతుంది.

దంచి కొడుతున్న ఎండలు

వేసవి లో ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని మార్చి నెల తొలి వారం నుండి చూపుతున్నాడు.మధ్యాహ్న వేళల్లో భగ భగ మండే ఎండలు ను చూసి ప్రజలు ఇళ్లలోంచి బైటకి రావడానికి భయపడుతున్నాడు .ఈ వేసవి లో గరిష్ట స్థాయిలో ఉస్త్నోగ్రత లు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతారు.కొన్నిరోజులు లో గరిష్ట స్థాయి లో పెరిగే అవకాశం వుంది అని అధికారులు చెబుతారు. 

సాధారణం కంటే ఎక్కువ

వేసవి లో ఎండ తీవ్రత ఏటికేడాది అధికం గా పెరుగుతుంది.కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామిక కాలుష్యం అధికమవుతుంది అని ఈ కారణం గానే ఉస్త్నొగతలో  పెరుగుదల నమోదు అవుతుంది అని వాతావరణ శాస్త్రవత్తలు వెల్లడిస్తున్నారు భూతాపం పెరగడం తో  ప్రపంచ వ్యాప్తంగా1900 నుండి ఇప్పటి వరకూ0.9 డిగ్రీల నుండి 1 సెల్సియస్ వరుకు పెరిగినట్టు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.
తీవ్రం కానున్న వడ గాలులు

రాబోయే కాలంలో తీవ్రమైన వడగలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు అధికం గ వున్నాయి.అని వాతావరణ శాఖ అధికారులు చెబుతారు.ప్రతి సంవత్సరం ఎండ తీవ్రత పంటలపై కూడా చాలా ప్రభావాలను చూపిస్తుంది.అని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.
వేసవకాలం లో శరీరాన్ని చల్లగా వుంచడానికి చిట్కాలు

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎండల తాకిడికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.వేసవి లో శరీరం లో నీరంతా చెమట రూపంలో బయటకి వచ్చేయడం వల్ల మన శరీరం  డీ హైడ్రేషన్ కి గురి అవుతుంది.దాంతో నీరసం , వడ దెబ్బ వేసవి కాలం లో వచ్చే వ్యాధుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది.అందుకే వేసవి లో శరీరాన్ని చల్లగా వుంచుకోడం ఎంతైనా అవసరం వుంది.శరీరాన్ని నీటి శాతాన్ని బ్యాలన్స్ చేసుకోవాలి ఈ నీటి శాతాన్ని పంచుకోవడానికి చాలా మంది ప్రజలు చల్లటి  పానీయాలను తీసుకుంటారు.కాని ఈ చల్లటి పానీయాలను తాగడం వలన ఆరోగ్యం  ముప్పుతిప్పలు పెడుతుంది.రక్త నాళాలు నిర్మాణాన్ని అడ్డుకుని ఆనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.అయితే వేసవి లో ఆరోగ్యం గా ఉండడానికి , శరీరాన్ని చల్లగా వుంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

వేసవి లో శరీరాన్ని చల్లగా వుంచుకోవడానికి కొన్ని ప్రత్యేకం ఐన బాడీ కూలింగ్ ఫుడ్స్ మి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి అని ఆరోగ్య నిపుణుల సలహా .వేసవి కాలంలో శరీరాన్ని కూల్ గా వుంచే అటువంటి ఆహార లిస్ట్ ను కొన్ని హెల్త్ టిప్స్ ను మీకోసం అందిస్తుంది.
వెజిటేబుల్ 

తాజాగా వుండే సీజన్ వెజిటేబుల్.గ్రీన్ లీఫీ వెజిటబుల్ లో  80 నుండి 90 శాతం నీరు ఎక్కువగా వుంటాయి.ఇది తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవదానికి చాలా అద్భుతంగా సహాయ పడుతుంది.

నీరు ఎక్కువగా తాగాలి

వేసవి లో శరీరాన్ని చల్లగా వుంచుకోవాదానికి మీరు కచ్చితంగా నీరు త్రాగల్సి వుంటుంది.మి శరీరాన్ని చల్లగా వుంచుకోవడానికి ప్రతి రోజూ 2 లీటర్ల నీరు కనీసం తాగాలి.

పండ్ల రసం 
వేసవి కాలం లో శరీరాన్ని చల్లగా వుంచుకోవడానికి ఎక్కువగా పండ్ల రసాలను తీసుకోవాలి. ఆరంజ్, పైనాపిల్, వంటి పండ్ల రసాలను మరియు నిమ్మరసం మరికొన్ని సీజనల్ ఫ్రూట్ తో తయారు చేసే పండ్ల రసాలను రెగ్యులర్ డైట్ లో ఉంచుకోవాలి.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్ లో ముఖ్యం గా మజ్జిగ మరియు లస్సీ వంటి రెండు రకాల బెవరిజ్ లు సమ్మర్ సీజన్ లో తీసుకోవడం ఈ వేసవి కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా మరియు చల్లగా వుంచుకోవడానికి సహాయ పడుతుంది . 

టీ
చలి కాలం లో శరీరాన్ని వేడి కోసం టీ నీ మనం త్రాగుతూ వుంటాం.కాని వేసవి లో కూడా శరీరాన్ని చల్ల గా వుంచుకోవడానికి ఈ టీ ఉపయోగ పడుతుంది.వేసవి లో చాలా అతి ముఖ్యమైన ద్రవ పదార్థం. వేసవి లో స్పైసి ఫుడ్స్ తినడం వలన వేడి నోటి ద్వారా..శ్వాస ద్వారా బయటకు వెళ్లి పోతుంది .వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా వుంచుతుంది .

చిన్న మోతాదు లో భోజనం

ఒక్కేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా, తీసుకునే ఆహారం చాలా చిన్న మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.మద్య మద్యలో గాప్ ఇస్తు ఎక్కువ సార్లు తినడం మంచిది .ఎక్కువ ఆహారం ఒకేసారి తినడం వల్ల శరీరంలో వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడానికి, శరీరం లో వేడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి శరీరాన్ని చల్లగా వుంచుకోవడానికి ఎక్కువగా కాకుండా కొంచం మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

నేల

వేసవి కాలం లో మీ శరీరాన్ని చల్లగా వుంచడానికఈ మి ఇంట్లో వుండే నేల మీద పడుకోవడం వల్ల మి శరీరం చల్లగా వుంచుతుంది.మరియు మీరు హాయగ నిద్ర పోవటానికి సహాయ పడుతుంది.

కోల్డ్ షవర్ 

వేసవి కాలంలో చల్లని నీటితో స్నానం చేయడం వలన మి శరీరం చల్లగా వుంటుంది. మీరు కనీసం గోరు వెచ్చని నీటితో ఐన స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్