ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కరోనా వైరస్ నివారణ చిట్కాలు మరియు ఎలా వచ్చింది

కరోనా వైరస్ నివారణ చిట్కాలు మరియు ఎలా వచ్చింది

కరోనా,కరోనా ప్రపంచమంతా ఈ పేరుతోనే మారుమోగుతోంది. ఈ కరోనా వైరస్ యొక్క నివారణ మరియు చిట్కాలు ఏంటి అని కావున ఈ వైరస్ నుండి బారిన పడకుండా ఉండడానికి నిమగ్నమై ఉంది.  చైనాలో వెలుగుచూసిన ఈ వైరస్ అక్కడ ఎలా వచ్చింది అని  శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు జపాన్ దక్షిణ కొరియా థాయిలాండ్కు విస్తరించింది. అక్కడితో ఆగకుండా అమెరికా సైతం పాకింది ఇప్పుడు మన భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఈ కరోనా వైరస్ వలన రోజురోజకి మరణాల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. వైరస్ అనేది ఎక్కడో ఉంటె మనకేం అని అనుకోవడానికి అవకాశం లేదు వైరస్ అనేది చాల వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతానికి ఇది స్వల్పంగా ఉన్నా ఎప్పుడూయినా  మహమ్మారిగా పరిణమించే అవకాశం ఉంది అని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
Corona virus looks likes crown
కరోనా వైరస్ 

అసలు ఏమిటి ఈ కరోనా వైరస్ మరియు భారతదేశనికి ఎలా వచ్చింది? 

వైరస్ అనేది లాటిన్ పదం దీనికి విషం అని అర్ధం వీటిని మనం కంటితో చూడలేం. అతి సూక్ష్మమమైయినవి. ఇవి ఇతర జీవ కణాల పై దాడి చేసి వ్యాధికి కారణం అవుతాయి. వాటి సంతతిని పెంచుకుటాయి. వైరస్, బాక్టీరియా సిలిండర్ల కంటే శక్తివంతమైయినవి. జలుబు, ఫ్లూ, మశూచి, చికెన్ పాక్స్, డెంగీ, తాజాగా కరోనా వంటివి వైరస్ వల్లే వ్యాపిస్తుంది.


ప్రపంచ వ్యాప్తంగా 3,20,000 రకాల వైరస్ ఉన్నైయని అంచనా. చార్లెస్ చాంబర్లాOడ్ 19 వ శతాబ్దంలో పోర్స్లీన్ ఫిల్టర్ సహాయంలో మొదటి సారిగా వైరస్ గుర్తించారు. మన శరీరంలో  చాలా వైరస్లు ఉంటాయి. కొన్ని అందులో శరీరంలో ఉన్నప్పటికీ నిద్రాణ స్థితిలో ఉంటాయి. అప్పుడు వాటి సంఖ్య పెరిగి ఆ మనిషి అనారోగ్యానికి గురి అవుతాడు.


కరోనా వైరస్ పుట్టుక ఎలా జరిగింది 

కరోనా వైరస్ అనేది పాములు, వన్యప్రాణులు, గబ్బిలాల నుండి ఈ వైరస్ మనుషులకి వ్యాప్తి చెంది ఉంటుందని పరిశోదుకులు భావిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 2019, మధ్య కాలంలో కరోనా వైరస్ మొదటి కేసు నమోదు అయ్యంది. పాములోనే కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

People wearing mask to prevent virus
మాస్క్ ధరించటం 

1960లో దీనిని మొట్టమొదటి  సారిగా కనుక్కున్నారు. కిరీటాల ఆకారంలో ఈ వైరస్ ఉండడం వలన దీనికి కరోనా వైరస్ అనే పేరు వచ్చింది. 2003 లో ఈ వైరస్ తొలిసారిగా జనాల ముందుకు రాక్షస రూపంలో వచ్చింది 774 మందిని బలితీసుకుంది అయినప్పటికీ దీనికి వాక్సిన్ కినిపెట్టి శాశ్వతంగా తరిమి కొట్టరు.

హమ్మయ్య! అని అనుకొనే లోపు 2014 లో మళ్ళీ వచ్చింది 858 మందిని బాలితీసుకుంది. మళ్ళీ వాక్సిన్ కనిపెట్టి తరిమికొట్టారు. కాని మళ్ళీ 2019 డిసెంబర్లో మళ్ళీ రాక్షస రూపం దాల్చి జనాలపై విరుచుకుపడుతుంది.

ఈ వైరస్ పూర్తి పేరు 2019 నొవల్ కరోనా వైరస్ గా పేరు పెట్టేరు. కరోనా వైరస్ జంతువులలో ఎక్కువగా, మనుషులలో తక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు SARS, MERS AND 2019-NCOV అతి ప్రమాదకరంగా ఉన్నాయి

కరోనా వైరస్ లక్షణాలు
 • ముక్కు కారటం
 •  తుమ్ములు
 • జ్వరం
 •  ఒళ్ళు  నొప్పులు
 •  గొంతు నొప్పి
 • తలనొప్పి
 •  చలి
 •  గుండె వేగంగా కొట్టుకోవడం
 •  పొడిదగ్గు
 • స్వల్పంగా ఆయాసం
 •  జీర్ణకోశ సమస్యలు
 • విరోచనాలు
 • నిమోనియా
 • మూత్రపిండాల వైఫల్యం
ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి సోకుతాయి. ఇవి నోరు, ముక్కు, కళ్ళ వంటి అవయవాల మీద పొరల మీద ఇన్ఫెక్షన్ వస్తుంది.

తుంపర్లు పడిన వస్తువులను ముట్టుకొని, అవే చేతులతో నోరు, ముక్కు, కళ్ళను రుద్దుకున్నా వైరస్ వంటిలోకి ప్రవేశిస్తుంది. జన సాంద్రత ఎక్కువగా గల స్థలంలో కిక్కిరిసిన ఆవాసాల్లో వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుంది.


పోషణ లోపం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వైరస్ త్వరగా సోకుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా గల పిల్లలు, వృద్దులు లలో ముప్పు ఎక్కువ.


చైనాలో వుహాన్ నగరంలో కరోనా పుట్టుక ఎలా జరిగింది 

ఇప్పటి వరకు ఎక్కువ ప్రాణనష్టం జరిగిన వుహాన్ నగరంలో పరిస్థితి దయనీయంగా మారుతుంది. వాక్సిన్ తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి వన్యప్రాణం ల పెంపకం, రవాణా, విక్రయాలపై చైనా నిషేధం ఉంటుంది అని తెల్పింది.

చైనాలో 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి వైద్య సేవలు ప్రారంభించారు. అవసరం, ఆలోచన, ఆధునిక విగ్యానమ్, ఎలాంటి అసాధ్యనైనా సుసాధ్యం చేస్తుంది అవడానికి ఇదే పెద్ద ఉదహరణ. 7000 మంది మనుషులతో 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని కట్టారు.


చైనాలో కొంతమంది తెలుగు ఇంజినీర్లు చిక్కుకున్నారు వారిని తీసుకొచ్చే ఏర్పాటులో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కరోనా వ్యాప్తిని ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించిన డబ్ల్యూ హెచ్ ఓ WHO

ప్రణాళిక ప్రకారం 2 ఆసుపత్రులు కడతారు ఒకటి పూర్తి అయింది రెండవది 1600 పడకలతో మరో భవణ నిర్మాణం జరుగుతుంది. మెడికల్, రోబోలు, అధునాతన సౌకర్యాలను కలిగించి వైద్య సేవలు అందిస్తున్నారు.

నిం గ్రానైట్ పరిశ్రమకు కరోనా వల్ల నష్టం జరుగుతుంది ఎగుమతి దిగుమతి ఆగిపోయాయి. సుమారుగా 3000 మంది ప్రపంచం వ్యాప్తంగా మరణాలు సంభవించాయి. చైనాలో హుబెయ్ ప్రావిన్సులోని 24 గంటలలో 64 మంది చనిపోవడం ఎంత తీవ్రతగా వైరస్ ఉందో తెలుస్తుంది

మన దేశంలో తొలి కేసు కేరళలో నమోదు అయ్యింది.

ప్రపంచం పై కరోనా వైరస్ ప్రభావం 

కరోనా వైరస్ ప్రపంచం లో 200 దేశాలు పైగా వ్యాప్తి చెందింది ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల ఒక లక్ష ఇరవై అయదు వేల (1,25000) మంది మరణాలు సంభవించాయి మరియు ఈ వైరస్ బారిన పుదీనా వాళ్ళు ఇరవై మూడు లక్షల (23,00,000) మంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, చైనా మరియు యూరోపియన్ దేశాలలో ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ గా ఉంది.

కరోనా వైరస్ ప్రపంచంలో చాలా దేశాలలో భయానకంగా వ్యాపించింది ఆ దేశాలు యొక్క ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం వల్ల అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భారత్ వంటి దేశాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వాళ్ళ ఇక్కడ మన దేశంలో చాల తక్కువగా ఉంది అని భావిస్తున్నారు. అంటే వేసవి కలం లో మన దేశం యొక్క ఉష్ణోగ్రత చాల ఎక్కువగా ఉంటుంది. కావున మనకు కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది

కరోనా వైరస్  నివారణ చిట్కాలు 

Hand wash with soap to prevent corona virus
చేతులు సబ్బుతో కడగడం 
 •  తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ముక్కుకు, నోటికి, రుమాలు అడ్డం పెట్టుకోవాలి.
 • జలుబు, ఫ్లూ లక్షణాలు గల వారికి దూరంగా ఉండడం మేలు. 
 • తరచూ చేతులు కడుకోవాలి. 
 • వంట పని ముందు తరవాత, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుకోవాలి. 
 • జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. 
 • జంతువులను చేతికి ముక్కుకు రక్షణ లేకుండా తాకరాదు. 
 • మాంసాహారం తినేవారు బాగా ఉడికిన తరవాత మాంసం గుడ్లు తినాలి. 
 • జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. 
 • లక్షణాలు బట్టి జ్వరం నొప్పులు తగ్గడానికి పారసిటమాల్ మాత్రలు ఉపయోగపడతాయి.
చైనా నుండి వచ్చిన రాష్ట్ర వాసులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. శీతలీకరణ మాంసం తినొద్దు అని, కరచాలనం చేయకూడదు అని దిల్లీ ప్రభుత్వం తెలిపింది. విమానంలో ప్రయాణించే వారు ముందుగా ముఖానికి అడ్డంగా ఉన్న మాస్కు స్వీకరించాలి.


వైద్య పరీక్షలు చేయిచుకోవాలి, పక్క వారితో సన్నిహితంగా మెలగద్దు. ప్రపంచంలో 26 దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మన దేశంలో కూడా కేరళలో మొదటి కేసు నమోదు అయ్యింది. కాబట్టి ఎలాంటి సమయంలోనైనా మన భారతదేశానికి వ్యాపించే అవకాశం ఉంది.


కాబట్టి ఈ వ్యాధికి ఇంకా మందుని కనిపెట్టలేదు దీనికి నివారణ ఒక్కటే మార్గం.మనకి మన చుట్టూ ఉండే వాళ్ళకి రాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి గురించి తెలియని వాళ్ళకి చెప్పి ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి బయట పడదాం.


COVID-19 అంటే ఏమిటి?

COVID-19 అని నామకర్ణం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్ధ WHO. దీని అర్థం

CO-కారొనా  VI-వైరస్, D- డిసీస్ (వ్యాధి), 19- 2019.

ఇప్పుడు ప్రపంచ అంతా ఈ వైరస్ నీ నోవెల్ కరోనా లేదా కోవిద్ 19 అని పిలుస్తుంది.

మన దేశంలో కరోనా ప్రభావం 

మన దేశ ప్రియతమా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు ఈ కరోనా వ్యాప్తి కారణంగా ఈ నెల అంటే మార్చ్ 22న ఆదివారం 2020, దేశం అంతా కూడా ఒక్క రోజు కర్ఫ్యూ నీ అమలు చేసేరు. విజయవంతం అయంది.


కని కరోనా వ్యాప్తి నీ బాగా తెలుసుకున్న మన ప్రధాని మంత్రి గారు 21 రోజుల లాక్ డౌన్ నీ ఆదేశం ఇచ్చారు...


కరోనా ప్రపంచం లో వేల మందిని బలి తీసుకుంటోంది. వీళ్ళ లో డాక్టర్, వైద్య వైబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చే కొత్త ప్రశ్న ఏంటి అంటే ఈ కరోనా వైరస్ ఎలా మనుషులకు సోకుతుంది.ఇతర రోగ లక్షణాలు మధ్య పోలికలను, తేడాలను గమనించిన తర్వాత నిపుణుల అంచనా ఒక్కటే. కొత్తగా వచ్చిన వైరస్ కు, ఆ వ్యక్తి వ్యాధి నిరోధక శక్తి కి మద్య జరిగే పోరాటానికి సంకేతం .జలుబు..ప్రతి కేస్ లో కరోనా వైరస్ బాడీ సెల్స్ ను చంపేస్తుంది.వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నపుడు ప్రభావం తక్కువగా ఉండటం.అదే వయస్సు ఎక్కువగా ఉన్నవారికి అందులోనే వారికి మధు మేహం, గుండె సంబంధిత రోగాలు ఉన్నపుడు కరోనా ప్రమాదకరం గా మారుతుంది.


ఒక నివేదిక ప్రకారం 50 ఏళ్లు దాటిన మగవారిని ఈ కరోనా వైరస్ బలితీసుకుంటుంది .ఎపుడైనా వైరస్ వచ్చిన వెంటెనే వ్యాధి నిరోధక శక్తి బాడీ లోని వ్యాధి నిరోధక శక్తి ఎదురు దాడి మొదలు పెడుతుంది.ఒకసారి వ్యాధి నిరోధక శక్తి బలహీనపడిన వెంటనే వైరస్ చెలరేగి పడుతుంది.
కరోనా బాధితుడు దగ్గిన, తుమ్మినా, వైరస్ గాల్లోకి చేరుతుంది.ఒకవేళ బాధితుడు ఎదుటివారు ముఖం మీద తుమ్మితే మరింత ప్రమాదం .అతనికి సోకే అవకాశాలు తక్కువ వుంటాయి.తెలియక కరోనా బాధితుడు నీ తాకిన, వాళ్ళ నోరు ముక్కు ద్వారా ఎదుటి వారి శరీరం లో కి ప్రవేశిస్తుంది.

చైనా లో కొత్తగా పుట్టుొచ్చిన వైరస్ .శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపే ఈ వైరస్ ను 1960 లో తొలిసారిగా కనుక్కున్నారు.పక్షులు, క్షిరధాల్లో ఈ వైరస్ ఎక్కువగా వుంటుంది .ఈ వైరస్ ఊహన్ లో ఓ సముద్రపు ఆహార ఉత్పత్తి లలో మార్కెట్ లలో కొత్త వైరస్ వచ్చునట్లు అధికారులు గుర్తించారు.వైరస్ వల్ల ఊహాన్ లో 2 మృతి చెందడం తో ఈ  సాంపుల్స్ నీ లండన్ కి పంపించి పరిశోధనలు నిర్వ హించారు. పరిశోధనల్లో కరోనా గా నిర్వహించారు.ఈ వ్యాధికి టీకాలు...తప్ప వాక్సిన్ లేదు.. దీని మొదటి కేసు..డిసెంబర్ 1 2019 న వచ్చింది.

కరోనా వైరస్ చాలా సాధారణం గా వుంటుంది.శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలలో దీనిని గుర్తించవచ్చు .

కరోనా వైరస్ అను పేరు గల వైరస్ కలిగించే జబ్బు పేరు కోవిడ్ 19. కరోనా వైరస్ జబ్బు లక్షణాలను 1 నుండి 14 రోజులు.. పడుతుంది. సాధారణం గా..5 రోజుల్లో  బయిట పడుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియ చేస్తుంది.

ఇవి ఎక్కువ పక్షులు , క్షీరదాలు పై ప్రభావాన్ని చూపిస్తాయి.కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మనుషు ల పై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది.
చైనా లో 2020 మార్చి 5 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 95000 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.చైనా , ఇటలీ లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. 3200 మందికి పైగా మరణించారు

వేసవి కలంలో కరోనా వైరస్ విజృంభణ తక్కువగా ఉంటుంది అని ప్రపంచ వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ యొక్క నివారణ చిట్కాలు ఇంకా చాల రకాలు ఉన్నాయ్. వైద్యులు చెప్పే నివారణ మార్గాలు తెలుసుకొని పాటించాలి. మన ఆరోగ్యం కాపాడుకోవాలి. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్